Love Mocktail 2: శాండిల్ వుడ్ బ్లాక్ బస్టర్ 'లవ్ మోక్టైల్ 2' మూవీ నుంచి 'ఎవరితో పయనం' సాంగ్ విడుదల..

Love Mocktail 2: కేజీఎఫ్ నుంచి తెలుగులో మళ్లీ కన్నడ బ్లాక్ బస్టర్ చిత్రాల దండయాత్ర మొదలైంది. కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ 2,కాంతార మూవీలు టాలీవుడ్‌లో మంచి విజయం సాధించాయి. ఈ కోవలో వస్తోన్న మరో చిత్రం 'లవ్ మోక్టైల్ 2'. తాజాగా ఈ సినిమా నుంచి ఎవరితో పయనం సాంగ్‌ను విడుదల చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 28, 2024, 02:53 PM IST
Love Mocktail 2: శాండిల్ వుడ్ బ్లాక్ బస్టర్ 'లవ్ మోక్టైల్ 2' మూవీ నుంచి 'ఎవరితో పయనం' సాంగ్ విడుదల..

Love Mocktail 2: ఈ మధ్యకాలంలో తెలుగులో కన్నడ సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ కోవలో కన్నడ బ్లాక్ బస్టర్ నిర్మాత, రచయత దర్శకుడు హీరో డార్టింగ్ కృష్ణ నటించిన సినిమా 'లవ్ మోక్టైల్ 2'. తాజాగా ఈ మూవీ నుంచి పయనం అంటూ సాగే ఈ పాటకి గురు చరణ్‌ సాహిత్యం అందించారు. యోగి సురేష్ అద్భుతంగా ఆలపించారు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్ర తాండవ, చార్లీ లవ్ మాక్టైల్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ లీడ్ రోల్స్‌లో యాక్ట చేశారు. రు. అదేవిధంగా తను నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ హీరోగా నటించిన లవ్ మోక్టైల్, లవ్ మోక్టైల్ 2 చిత్రాలతో కన్నడ లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి.  ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కంచి కామాక్షి  కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకం పై ఎం వి ఆర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.ఆర్ కృష్ణ గారు మాట్లాడుతూ : శాండిల్‌వుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని సమ్మర్ హాలీడేస్‌లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము. డార్లింగ్ కృష్ణ కన్నడలో బ్లాక్ బస్టర్ హీరోగా మంచి సినిమాల్లో నటించాడు. అతను దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కి సంబంధించిన పాటను  విడుదల చేసాం. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ ప్రమోషన్ ఆక్టివిటీస్ తో గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు వస్తామన్నారు.  మంచి సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమా కూడా అలాగే కంటెంట్ ఉన్న ఒక మంచి సినిమా. కథలో శివరాజ్ కుమార్ వేద సినిమాకి తెలుగు ప్రేక్షకులు హిట్ చేసి చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇ లవ్ మోక్టెల్ 2 సినిమాతో మీ ముందుకు రాబోతున్నాము. ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాన్నారు.  

నటీనటులు :
డార్లింగ్ కృష్ణ, మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్

టెక్నికల్ టీం :
నిర్మాణం : కంచి కామాక్షి  కోల్కతా కాళీ క్రియేషన్స్
నిర్మాత : ఎం వి ఆర్ కృష్ణ
మ్యూజిక్ : నకుల్ అభయాన్కర్
డిఓపి మరియు ఎడిటర్ : శ్రీ క్రేజీ మైండ్స్
కథ మరియు దర్శకత్వం : డార్లింగ్ కృష్ణ
పి ఆర్ ఓ : మధు VR

Also Read: Pawan Kalyan: జనసేనకు పవన్‌ కల్యాణ్‌ భారీ విరాళం.. ఇకపై ఏపీలో రణరంగమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News