రామ్ గోపాల్ వర్మ తీస్తున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా పెద్ద దుమారమే రేపుతోంది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని తెలిపి.. ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న నిర్మాత కేతిరెడ్డి ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన గురువు రామ్ గోపాల్ వర్మ చేసిన పని తనకు నచ్చలేదని.. తనకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్‌కే ప్రాణం ఉన్నంతవరకూ సపోర్టు ఇస్తానని ఆయన అన్నారు.
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఓ భారీ ప్రకటనను విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్ ట్వీట్లకు తాను నెగటివ్‌గా కాకుండా లాజికల్‌గా సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఆ సమాధానాలు ఇవే.
నటి శ్రీరెడ్డి వివాదంలో కథ అనేకనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో "గంగపుత్రులు" సినిమా హీరో రాంకీ మాట్లాడుతూ ఈ కథలో ఆర్జీవి బహిర్గతం చేసిన విషయాలు ఇంటర్వెల్ మాత్రమేనని.. క్లైమాక్స్ వేరేగా ఉంటుందని తెలిపారు.
ప్రముఖ నిర్మాత వాకాడ అప్పారావు పై సినీ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్థ నగ్న ప్రదర్శన చేసి.. తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి బహిర్గతం చేసిన ఇప్పుడు మరోసారి ట్విటర్ ద్వారా విరుచుకుపడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.