నాగార్జున ఫ్యాన్స్‌కి ఆర్జీవి ఆహ్వానం

అక్కినేని నాగార్జున ఫ్యాన్స్‌కి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆహ్వానం పలికారు. 

Last Updated : May 24, 2018, 06:49 PM IST
నాగార్జున ఫ్యాన్స్‌కి ఆర్జీవి ఆహ్వానం

అక్కినేని నాగార్జున ఫ్యాన్స్‌కి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆహ్వానం పలికారు. ఈ నెల 28వ తేదిన హైదరాబాద్‌లోని ఎన్ కన్వేన్షన్‌లో రాత్రి 7 గంటలకు జరిగే "ఆఫీసర్" ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కి హాజరు కావాల్సిందిగా ఆయన నాగార్జున అభిమానులను కోరారు. "నాగార్జున్ ఫ్యాన్ అందరూ.. ప్లీజ్ ఈ ఈవెంట్‌కి రండి" అని తెలిపారు.  జూన్ 1వ తేదిన "ఆఫీసర్" సినిమా విడుదల కానుంది.

అయితే రామ్ గోపాల్ వర్మ ఫేస్‌బుక్‌లో పెట్టిన ఈ పోస్టుకి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఆర్జీవి "ప్లీజ్" అనే పదాన్ని వాడడంపై నెటిజన్లు అభ్యంతరం తెలిపారు. అలాంటి మాటలు ఆర్జీవికి సూటవ్వవు అన్నారు. అలాగే పలువురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆర్జీవికి వార్నింగ్ ఇచ్చారు. ఆర్జీవి హైదరాబాద్ వచ్చి ఈవెంట్ ఎలా చేస్తారో చూస్తామని వారు తెలిపారు. ఆర్ కంపెనీ ప్రొడక్షన్ పై ఆర్జీవి, సుధీర్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్న "ఆఫీసర్" చిత్రంలో నాగార్జున, మైరా సైరీన్, బేబీ కావ్య, ఫిరోజ్ అబ్బాసీ, షాయాజీ షిండే, అజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

శివ, అంతం, గోవిందా గోవిందా చిత్రాల తర్వాత నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషనులో వస్తున్న చిత్రం కావడంతో "ఆఫీసర్" చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రవి శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా... భరత్ వ్యాస్, రాహుల్ పెనుమత్స సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. అయితే ఈ చిత్ర కథ తనదేనని.. రామ్ గోపాల్ వర్మ ఆ కథను కాపీ కొట్టారని ఇప్పటికే  జయకుమార్ అనే యువ రచయిత సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ క్రమంలో "ఆఫీసర్" స్క్రిప్టు అని తెలుపుతూ ఓ స్క్రిప్టును ఆయన గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా అందరికీ షేర్ చేశారు. 

Trending News