రామ్ గోపాల్ వర్మ తీసిన "ఆఫీసర్" సినిమా కథ నాదే: నాగార్జునకి యువ రచయిత ఫిర్యాదు

రామ్ గోపాల్ వర్మ తీసిన "ఆఫీసర్" సినిమా కథ నాదే: జయకుమార్ 

Last Updated : May 19, 2018, 09:01 AM IST
రామ్ గోపాల్ వర్మ తీసిన "ఆఫీసర్" సినిమా కథ నాదే: నాగార్జునకి యువ రచయిత ఫిర్యాదు

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా "ఆఫీసర్" పేరుతో ఓ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కథను తానే రాశానని.. దానిని ఆర్జీవి కాపీ కొట్టారని యువ రచయిత జయకుమార్ ఆరోపణలు చేశారు. సర్కార్ 3 సినిమాకి ఆర్జీవితో పాటు జయకుమార్ కూడా స్టోరీ డిస్కషెన్లలో పాల్గొన్నారు.

తాజాగా జయకుమార్ తానే "ఆఫీసర్" సినిమాకి చెందిన ఒరిజినల్ రైటర్‌నని చెబుతూ.. ట్విట్టర్‌‌లో నాగార్జునను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. నాగార్జునే తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. అలాగే జయకుమార్ తాను రాశానని చెప్పుకుంటున్న "ఆఫీసర్" సినిమా స్క్రిప్టును కూడా గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే జయకుమార్ ఈ పోస్టు పెట్టకముందే ఆర్జీవి వేరే విధంగా స్పందించారు.

"ఆఫీసర్" కథ పుట్టడానికి కారణం నిజమైన పోలీస్ కమీషనర్ కేఎం ప్రసన్న అని.. ఆయన ముంబయి క్రైం బ్రాంచిలో అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీసుగా పనిచేశారని.. 2010లో ఆయన తనకు చెప్పిన అనుభవాల ఆధారంగా తాను "ఆఫీసర్" కథ తయారు చేశానని తెలిపారు. 

 

Trending News