ఆర్జీవి చిత్రం "ఆఫీసర్" కొత్త టీజర్ విడుదల

అక్కినేని నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆఫీసర్‌’. మైరా శరీన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. 

Last Updated : May 4, 2018, 09:41 PM IST
ఆర్జీవి చిత్రం "ఆఫీసర్" కొత్త టీజర్ విడుదల

అక్కినేని నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆఫీసర్‌’. మైరా శరీన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన తొలి టీజర్‌ని నిర్మాతలు విడుదల చేయగా.. తాజాగా మరో సరికొత్త టీజర్ విడుదల చేశారు. పోలీస్ ఆఫీసరైన నాగార్జునకు, ఓ పాపకు మధ్య జరిగిన సన్నివేశాలతో ఈ టీజర్ సాగుతుంది.

ముఖ్యంగా ఢిఫరెంట్ టేకింగ్‌తో పాటు పలు ఎమోషనల్ సీన్స్‌తో టీజర్‌ని వైవిధ్యంగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఇదే సినిమాకి సంబంధించిన థియేటర్ ట్రైలర్‌ను మాత్రం మే 12వ తేదిన విడుదల చేస్తామని ప్రకటించారు నిర్మాతలు. శివ, అంతం, గోవిందా గోవిందా చిత్రాల తర్వాత రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషనులో వస్తున్న చిత్రం కావడంతో "ఆఫీసర్"పై భారీ అంచనాలే ఉన్నాయి.

కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా.. సినిమా మే 25వ తేదిన విడుదల అవుతోంది. ఈ చిత్రంలో నాగార్జున ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా, నిజాయతీగా గల పోలీస్ ఆఫీసరుగా నటిస్తున్నారు. 

Trending News