ఈ వ్యక్తి ఆచూకీ చెబితే రూ.ల‌క్ష బ‌హుమ‌తి: వ‌ర్మ

ఈ వ్యక్తి పట్టిస్తే రూ.ల‌క్ష బ‌హుమ‌తి: వ‌ర్మ

Last Updated : Oct 13, 2018, 03:58 PM IST
ఈ వ్యక్తి ఆచూకీ చెబితే రూ.ల‌క్ష బ‌హుమ‌తి: వ‌ర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఫోటోలోని వ్యక్తి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తానని చెప్పారు.  

ఏపీ సీఎం చంద్రబాబును పోలిన వ్యక్తి ఒకరు ఉన్నారని ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఒక‌ హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తున్న ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ కాగా.. అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న రామ్ గోపాల్ వర్మ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తికి సంబంధించిన ఆచూకీ, ఫోన్ నెంబర్‌ను మెయిల్ ద్వారా Laksmisntr@gmail.com కి తెలియజేయాలని.. సమాచారం చెప్పిన మొదటి వ్యక్తికి లక్ష రూపాయల బహుమతి ఇస్తానని ట్విట్టర్ ద్వారా చెప్పారు. ఆ ఫోటో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోను వర్మ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.  

వర్మ  'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో ఓ సినిమాను తెరకెక్కించనున్నాడని తెలిసిందే. ఇందులో చంద్రబాబు పాత్ర ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోలో ఆ వ్యక్తి చంద్రబాబులా కనిపించడంతో.. అతని కోసం రామ్ గోపాల్ వర్మ ఇలాంటి ఆఫర్‌ను ఇచ్చారని సమాచారం.

కాగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ షూటింగ్ దసరా రోజున ప్రారంభిస్తానని, జనవరి నెలాఖరులో విడుదల చేస్తామని వర్మ ట్విట్ట‌ర్ ద్వారా వెల్లడించారు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి పూలదండలు మార్చుకుంటున్న నాటి ఫొటోను వర్మ పోస్ట్  చేస్తూ.. ఈ బయోపిక్‌కు సంబంధించిన వివరాలను ఈ నెల 19న తిరుపతిలో వెల్లడిస్తానని చెప్పారు. వర్మ పోస్టు చేసిన నాటి ఫొటోల్లో చంద్రబాబు కూడా కనిపిస్తారు.

 

 

Trending News