చంద్రబాబు సీఎం అవ్వడానికి లక్ష్మీపార్వతే కారణమా..?

రామ్ గోపాల్ వర్మ తీస్తున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా పెద్ద దుమారమే రేపుతోంది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని తెలిపి.. ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న నిర్మాత కేతిరెడ్డి ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

Last Updated : Oct 19, 2018, 09:55 PM IST
చంద్రబాబు సీఎం అవ్వడానికి లక్ష్మీపార్వతే కారణమా..?

రామ్ గోపాల్ వర్మ తీస్తున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా పెద్ద దుమారమే రేపుతోంది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని తెలిపి.. ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న నిర్మాత కేతిరెడ్డి ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సినిమా తీయాలని  భావించినప్పుడు చంద్రబాబును కలిశానని.. కానీ చంద్రబాబు లక్ష్మీ పార్వతి గురించి పాజిటివ్‌గా మాట్లాడారని.. ఆమె వల్లే తాను సీఎం అయ్యారు కాబట్టి.. ఆమె పేరు మీద సినిమా తీయవద్దని తెలిపారని కేతిరెడ్డి తెలిపారు. ఇప్పుడు వర్మ కూడా సినిమా తీస్తున్నారు కాబట్టి..తాను కూడా సినిమా తీసే విషయంలో పునరాలోచిస్తానని కేతిరెడ్డి తెలిపారు.

వర్మ తాను తీసే సినిమాలో లక్ష్మీపార్వతికి చెందిన విషయాలు దాటవేసే అవకాశం ఉంది కాబట్టి.. ఆ విషయాలు జనాలకు తెలియజేయడానికైనా తాను సినిమా తీయాల్సిన అవసరం ఉందని కేతిరెడ్డి అన్నారు. అంతే కానీ.. తనకు వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కేతిరెడ్డి "లక్ష్మీస్ వీరగ్రంథం" పేరుతో సినిమా తీయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో తాను లక్ష్మీపార్వతి జీవితానికి సంబంధించి అనేక విషయాలు సేకరించదలిచానని కూడా తెలిపారు.

"లక్ష్మీస్ వీరగ్రంథం" సినిమాకి సంబంధించిన వివరాలు సేకరిస్తున్న క్రమంలోనే కేతిరెడ్డి.. లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగంధం వెంకటసుబ్బారావు నివసించిన గ్రామానికి వెళ్లారు. అక్కడి స్థానికులతో మాట్లాడి అనేక వివరాలు సేకరించారు. అదే సమయంలో తన  జీవితాన్ని కించపరిచే విధంగా సినిమా తీస్తున్నారని లక్ష్మీపార్వతి కేతిరెడ్డిపై విరుచుకుపడ్డారు. తన స్థాయిని తగ్గించే విధంగా సినిమా తీస్తే ఊరుకొనేది లేదని కూడా అన్నారు. తాజాగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. లక్ష్మీపార్వతి వల్లే తాను సీఎం అయ్యానని చంద్రబాబు చెప్పడం వల్లే.. ఆమెపై సినిమా తీసే ఆలోచనను విరమించుకున్నానని.. కానీ వర్మ సినిమా తీస్తున్నారు కాబట్టి.. తాను కూడా మళ్లీ సినిమా తీసే అవకాశం ఉందని తెలిపారు. కాగా.. ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో బాలయ్య, క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Trending News