అదేంటి.. నాస్తికుడని చెప్పుకొనే రామ్ గోపాల్ వర్మ ఒక్కసారిగా భక్తుడిగా మారిపోయారేంటీ.. అని అనుకుంటున్నారా? అవును.. ఈ ఫొటోలో కనిపిస్తున్నది, మీరు చూస్తున్నది నిజమే. ఎన్టీఆర్‌యే తననిలా మార్చేశారని అంటున్నారు వర్మ.
వివరాల్లోకి వెళితే.. వర్మ ఎన్టీఆర్ జీవితాధారంగా ‘లక్ష్మీ'స్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటానని వర్మ గురువారం ట్వీట్ చేశారు. అన్నట్టే శుక్రవారం ఉదయం కొంతమంది బంధువులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు కాణిపాకం వినాయకుడిని కూడా దర్శించుకున్నారు.
వర్మతో పాటు లక్ష్మి పార్వతి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 'నేను దేవుణ్ణి నమ్ముతాను కానీ భక్తులను నమ్మను. ఎన్టీఆర్ మీదున్న గౌరవంతోనే తొలిసారి శ్రీవారిని దర్శించుకున్నా. లక్ష్మీ'స్ ఎన్టీఆర్ చిత్రంలో నిజాలు చూపిస్తా.' అని మీడియాకు శ్రీవారి దర్శనం అనంతరం చెప్పారు.
తను ఇలా మారడానికి కారణం దివంగత నటుడు నందమూరి తారక రామారావేనని అంటున్నారు వర్మ. చేతిలో తిరుపతి లడ్డూ పట్టుకుని, భుజంపై కండువా వేసుకుని, నుదుట బొట్టుతో దిగిన ఫొటోను వర్మ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోసం ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటో చూసి వర్మ అభిమానులు షాకయ్యారు. ‘వర్మలో ఇంత మార్పా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు తిరుపతి ల్పారామంలో ప్రెస్ మీట్ పెట్టి ‘లక్ష్మీ'స్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని వర్మ ట్విట్టర్‌లో ప్రకటించారు. 'నాస్తికుడినైన నేను నా జీవితంలో మొట్టమొదటి సారిగా రేపు పొద్దున్న 6 గంటలకి తిరుపతిలో బాలాజీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం 4 గంటలకి తిరుపతి శిల్పారామంలో ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మి ’స్ ఎన్టీఆర్ వివరాలు చెప్పబోతున్నాను' అని అన్నారు. జీవీ ఫిల్మ్స్ సంస్థ సమర్పిస్తున్న ఈ చిత్రానికి రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
This is what NTR did to me for the sake of #LakshmisNTR pic.twitter.com/7X0TPbfks6
— Ram Gopal Varma (@RGVzoomin) October 19, 2018
నాస్తికుడినైన నేను నా జీవితంలో మొట్టమొదటి సారిగా రేపు పొద్దున్న 6 గంటలకి తిరుపతి లో బాలాజీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం 4 గంటలకి తిరుపతి శిల్పారామం లో ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మి ’స్ ఎన్టీఆర్ వివరాలు చెప్పబోతున్నాను pic.twitter.com/IybrFUVr19
— Ram Gopal Varma (@RGVzoomin) October 18, 2018