శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ కన్నా పాపులర్: రామ్ గోపాల్ వర్మ

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోమారు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. 

Last Updated : Apr 9, 2018, 03:07 PM IST
శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ కన్నా పాపులర్: రామ్ గోపాల్ వర్మ

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోమారు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. టాలీవుడ్ నటి శ్రీరెడ్డి ఇప్పుడు జాతీయ సెలబ్రిటీ అయిపోయిందని ఆయన కితాబు ఇచ్చారు. "ముంబయిలో జనాలకు పవన్ కళ్యాణ్ అంటే పెద్దగా తెలీదేమో గానీ.. శ్రీరెడ్డి గురించి బాగానే తెలుసు. ఆమె గురించి బాగానే మాట్లాడుకుంటున్నారు" అని ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

అయితే ఇదే ట్వీట్ పై చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్మపై మండిపడ్డారు. ప్రతీ అయినదానికి.. కాని దానికి పవన్‌ను మధ్యలోకి తీసుకురావడం రామ్ గోపాల్ వర్మకి అలవాటు అయిపోయిందని, వర్మ ఈ పద్థతి మార్చుకోవాలని వారు హితవు పలికారు. కాగా..  ఫిల్మ్ ఛాంబర్‌కి వచ్చి అర్థనగ్న ప్రదర్శన చేసి సినీ పరిశ్రమ పరువును బజారుకీడ్చిన నటి శ్రీరెడ్డికి "మా" అసోసియేషన్ సభ్యత్వం ఇచ్చేదిలేదని ఆ సంస్థ అధ్యక్షుడు శివాజీరాజా ఈ రోజు తెలిపారు.

ఈ అసోసియేషనులో ఉన్న ఏ సభ్యుడు, సభ్యురాలు కూడా శ్రీరెడ్డితో కలిసి నటించకూడదని తాము తీర్మానించినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీరెడ్డికి మొదట్లో సభ్యత్వం అడిగితే దరఖాస్తు ఫారం ఇచ్చామని.. కానీ ఆమె కనీసం డీడీ కూడా చెల్లించలేదని.. ఉచిత సభ్యత్వం కావాలని డిమాండ్ చేసిందని అసోసియేషన్ సభ్యులు నటి హేమ తెలిపారు.

Trending News