Madhavi latha: వందే భారత్ ట్రైన్‌లో మాదవీలత హల్ చల్.. లడ్డు వివాదంపై ఏంచేశారో తెలుసా.?.. వీడియో వైరల్..

Tirumala laddu controversy: తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ మాధవీలత వందే భారత్ ట్రైన్ లో తిరుమలకు బయలు దేరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 26, 2024, 01:46 PM IST
  • తిరుమలకు బయలు దేరీన బీజేపీ మాధవీలత..
  • ట్రైన్ లో గోవిందనామాల భజనలు..
Madhavi latha: వందే భారత్ ట్రైన్‌లో మాదవీలత హల్ చల్.. లడ్డు వివాదంపై ఏంచేశారో తెలుసా.?.. వీడియో వైరల్..

Madhavi latha doing bhajans in vande bharat train video: తిరుమల లడ్డు వివాదం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సిట్ ను సైతం ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారిని భక్తులు కొంగుబంగారంగా భావిస్తారు. పిలిస్తే పలికే దైవంగా కొలుచుకుంటారు.  తిరుమల స్వామి వారికి మనదేశం నుంచి మాత్రమే కాకుండా.. ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామి వారికి మొక్కులు తీర్చుకుంటారు. ఇక తిరుమలలో లడ్డు గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. తిరుమల అంటేనే.. భక్తుడికి అక్కవ స్వామివారికి నైవేద్యంగా పెట్టి, భక్తులకు ఇచ్చే లడ్డు గుర్తుకు వస్తుంది. అంటే.. అంతటి పవిత్రమైనదిగా లడ్డును భావిస్తారు.

 

అయితే.. అలాంటి పవిత్రమైన లడ్డులో జంతువుల కొవ్వు, చేప నూనెలు కలిపారని కూడా.. ఏకంగా ముఖ్యమంత్రి చెప్పడం మాత్రం పెనుసంచలనంగా మారింది. అంతేకాకుండా.. లడ్డులకు ఉపయోగించిన నెయ్యి ల్యాబ్ రిపోర్టులను సైతం చంద్రబాబు బైటపెట్టారు.దీంతో ఇది ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా దీనిపై రచ్చ నెలకొంది. కేంద్రం కూడా దీనిపై వివారణ ఇవ్వాలని చంద్రబాబును కోరింది.అదే విధంగా జరిగిన ఘోర అపచారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు.

మరోవైపు ఏపీవ్యాప్తంగా అన్ని ఆలయాలలో కూడా శుద్ది కార్యక్రమం చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు తిరుమల లడ్డు వివాదంలపై ఇటీవల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేదని గట్టిగానే  వార్నింగ్ ఇచ్చారు. హిందు ధర్మానికి అన్యాయం జరిగితే మాట్లాడటం నేరమా.. అంటూ ఎమోషన్ అయ్యారు. తెలంగాణ కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం పవన్ కు సపోర్ట్ గా నిలిచారు.

మరోవైపు బీజేపీ మాధవీలత తిరుమల లడ్డు వివాదంపై కూడా ఇటీవల చిలుకూరు వెళ్లి అక్కడ పూజలు చేశారు.తిరుమల లడ్డును భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని అలాంటి లడ్డుపై వివాదం తలెత్తడం ఆందోళన కల్గించే అంశమన్నారు. ఇది కోట్లాది హిందువుల మనోభావాలకు చెందిన అంశమన్నారు. 

Read more: Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!  

తాజాగా, మాధవీలత వందే భారత్ ట్రైన్ లో తిరుమలకు పయనమయ్యారు. తన అనుచరులు, కొంత మంది నేతలతో కలసి వందేభారత్ ట్రైన్ లో భజనలు చేశారు. సహచర భక్త బృందంతో కలిసి ఆ గోవిందుడి నామం జపిస్తూ.. వెంటేశ్వర స్వామివారి పాటలు పాడుతూ భజన చేస్తూ వందే భారత్‌తో రైలులో మాధవీలత తిరుమలకు బయలుదేరారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News