Omicron Wave in India: కరోనా వ్యాక్సినేషన్‌తో వైరస్ నుంచి పొంచి ఉండే ముప్పు తగ్గుతుందని డా.క్రిస్టఫర్ ముర్రే పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగినందునా... డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ కేసులతో ఆసుపత్రిపాలవడం లేదా మరణం సంభవించే ముప్పు తక్కువగా ఉంటుందన్నారు
Weekend Curfew in Delhi and Karnataka: ఢిల్లీ, కర్ణాటకల్లో నేటి నుంచి వీకెండ్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. శుక్రవారం రాత్రి 10గం. నుంచే కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. సోమవారం (జనవరి 10) తెల్లవారుజామున 5గం. వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
Omicron Second Death in India : ఒమిక్రాన్ బలిగొన్న ఆ ఒడిశా మహిళకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం గమనార్హం. డిసెంబర్ 22న అనారోగ్యానికి గురైన ఆ మహిళ భోమా భోయి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చేరింది.
India Corona Cases Today: దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే 90,928 కొత్త కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో 325 మంది ప్రాణాలు కోల్పోయారు. 19,206 మంది కొత్తగా కోలుకున్నారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కు చేరింది.
Omicron Death in India: దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం (Omicron Death In India) సంభవించింది. రాజస్తాన్ కు చెందిన 73 ఏళ్ల పురుషుడు ఒమిక్రాన్ బారిన పడి డిసెంబరు 31న మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. టెక్నికల్ గా దేశంలో ఇదే తొలి ఒమిక్రాన్ మరణం అని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు.
Omicron scare: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనలు కలిగిస్తోంది. రాజస్థాన్‌లో ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Kerala Night curfew: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నేటి నుంచి కేరళలో రాత్రి పూట కర్ఫ్యూ అమలులోకి రానుంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు ప్రతీ రోజూ రాత్రి 10గం. నుంచి తెల్లవారుజామున 5గం. వరకు కర్ఫ్యూ ఉండనుంది.
Covid cases in India:దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6358 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,99,691కి చేరింది.
Omicron cases in India: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగతూ పోతున్నాయి. తాజాగా మరో రెండు రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. దీనితో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 450కి చేరువైంది.
Omicron cases in India: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు అధికంగా ఉన్నాయి.
What is Delmicron: ఒమిక్రాన్ స్వభావం, దాని తీవ్రతను కనుగొనే ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు ఉండగానే... 'డెమిక్రాన్' భయం మొదలైపోయింది. ఇంతకీ డెమిక్రాన్ కొత్త వేరియంటా... డబ్ల్యూహెచ్ఓ ప్రకటన చేయకముందే ఈ పదం ఎలా ప్రచారంలోకి వచ్చింది.
Omicron Case in Hyderabad: తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్‌లో 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. బాధితుడు సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడ్ని ఐసోలేషన్ కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 25కు చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.