Covid cases in India: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 9,195 కరోనా కేసులు (Covid cases in India) నమోదయ్యాయి. ప్రస్తుతం 77,002 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య (Omicron Cases in India) 781కి చేరింది. ఢిల్లీలో 238, మహారాష్ట్రలో 167, గుజరాత్ లో 73, కేరళలో 65, తెలంగాణలో 62, రాజస్తాన్ 46, తమిళనాడు 34, కర్నాటక 34, హర్యానా 12, పశ్చిమ బెంగాల్ 11, మధ్యప్రదేశ్ 9, ఒడిశా 8, ఏపీ 6 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒమిక్రాన్ నుంచి 241 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఈ ఒమిక్రాన్ వేరియంట్ దేశంలోని 21 రాష్ట్రాలకు వ్యాపించింది.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 7,347 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మెుత్తం సంఖ్య 3,42,51,292కు చేరింది. కోవిడ్ కేసుల రికవరీ రేటు (Recovery Rate) 98.40 శాతానికి చేరింది. గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకూ ఇదే అత్యధిక రికవరీ రేటు కావడం గమనార్హం. ప్రస్తుతం కోవిడ్ పాజిటివిటీ రేటు 0.79శాతంగా ఉంది. గత 86 రోజులతో పోలిస్తే 2 శాతం మేర కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గింది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.68శాతంగా ఉంది. గత 45 రోజుల కన్నా 1శాతం మేర వీక్లీ పాజిటివిటీ రేటు తగ్గింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 143.15 కోట్ల వ్యాక్సిన్ డోసులు (Vaccination) వేశారు.
781 Omicron cases in India so far. 9,195 new COVID19 cases reported in the last 24 hours, active caseload at 77,002 pic.twitter.com/T856yGqZ0k
— ANI (@ANI) December 29, 2021
Also Read: Covid 19: దేశంలో కొత్తగా 6358 కరోనా కేసులు-653కి చేరిన ఒమిక్రాన్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook