Rajasthan Omicron cases: చాపకింద నీరులా విస్తరిస్తోన్న ఒమిక్రాన్... రాజస్థాన్​లో కొత్తగా 21 కేసులు

Omicron: దేశంలో ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా రాజస్థాన్​లో కొత్తగా 21 ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూశాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 06:15 PM IST
  • దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
  • రాజస్థాన్​లో కొత్తగా 21 ఒమిక్రాన్​ కేసులు
  • అప్రమత్తమవుతున్న రాష్ట్రప్రభుత్వాలు
Rajasthan Omicron cases: చాపకింద నీరులా విస్తరిస్తోన్న ఒమిక్రాన్... రాజస్థాన్​లో కొత్తగా 21 కేసులు

Omicron cases in Rajasthan: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరానికి గురిచేస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు (Omicron cases in India) రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్​ విస్తరించింది. రాజస్థాన్​లో కొత్తగా 21 ఒమిక్రాన్​ కేసులు (Omicron cases in Rajastan) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్​ కేసుల సంఖ్య 43కు చేరింది. కొత్త కేసుల్లో జైపుర్​లో 11, అజ్మేర్​లో 6, ఉదయ్​పుర్​లో 3, మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైరస్​ సోకింది.

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 437కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 108 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత దిల్లీలో 79, గుజరాత్- 43, రాజస్థాన్-​ 43, తెలంగాణ- 38, కేరళ- 37, తమిళనాడు- 34, కర్ణాటక- 31 కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 115 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో..శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ (Night Curfew in Assam) అమలు చేయనున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది.

Also Read: Third Wave in India: ఫిబ్రవరి నాటికి ఇండియాలో కరోనా థర్డ్ వేవ్: ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు!

కర్ణాటకలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా కోలార్ లోని ఓ మెడికల్‌ కళాశాలలో 33 మంది విద్యార్థులకు కరోనా (Covid-19) సోకింది. వారందరినీ ఐసోలేషన్ లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర అహ్మద్​నగర్​లోని జవహర్​ నవోదయ విద్యాలయ​ పాఠశాలలో 19 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News