India Corona Cases Today: దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 90,928 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా ధాటికి మరో 325 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కొవిడ్ మహమ్మారి నుంచి 19,206 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 6.43 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
దేశంలో ప్రస్తుతం 2,85,401 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ నుంచి ఇప్పటి వరకు 3,43,41,009 మంది కోలుకున్నారు. కరోనా ధాటికి ఇండియాలో ఇప్పటి వరకు 4,82,876 మరణాలు నమోదయ్యాయి.
Number of #Omicron variant cases rises to 2,630 pic.twitter.com/KiIEBLIdXh
— ANI (@ANI) January 6, 2022
ఒమిక్రాన్ వ్యాప్తి
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630 కు చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.
వ్యాక్సినేషన్ ప్రక్రియ
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం మరో 96,43,238 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 148.67 కోట్లకు చేరింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. ఒక్కరోజే 25,35,852 కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనా కారణంగా 7,214 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Omicron Death in India: దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. కేంద్రం అధికారిక ప్రకటన
Also Read: Composite Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.634లకే LPG గ్యాస్ సిలిండర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.