Omicron Death in India: దేశంలో కరోనా కేసులు (Corona Cases) ఒక్కరోజే ఏకంగా 50వేల మార్క్‌ను దాటేశాయి. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) కేసులూ రెండు వేలనూ మించి పోయాయి. ఒమిక్రాన్ గత వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తుందని చెబుతూనే.. మరణాలు చాలా స్వల్పంగా ఉంటున్నాయని కొన్ని కథనాలు తెలిపాయి.
ఇప్పటి వరకు మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా పేషెంట్లు మరణించినట్టు (Omicron Death in India) కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా, కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఒమిక్రాన్ కారణంగా ఒకరు మరణించినట్టు ధ్రువీకరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
మన దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం రాజస్తాన్(Rajasthan)లో రిపోర్ట్ అయినట్టు వివరించారు. 73 ఏళ్ల వ్యక్తి కరోనా బారిన పడ్డారు. ఆయన శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఓ హాస్పిటల్‌లో డిసెంబర్ 31వ తేదీన మరణించారు.
మృతునికి డయాబెటిస్ వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. టెక్నికల్‌గా మన దేశంలో ఒమిక్రాన్ కారణంగా మరణించిన తొలి వ్యక్తి ఆయనే అని వివరించారు.
డిసెంబర్ 15న ఆయనకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. జ్వరం, దగ్గు, ఇతర సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరారు. కరోనా టెస్టు చేయగా పాజిటివ్ అని వచ్చింది. అనంతరం జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు.
డిసెంబర్ 25న జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితంలో ఆయనకు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, హైపర్ థైరాయిడిజం వంటి దీర్ఘకాలిక వ్యాధులు, కరోనా అనంతర నిమోనియో వంటి సమస్యలతో ఆయన మరణించినట్టు రాజస్తాన్ కు చెందిన ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
Also Read: PM Narendra Modi: ప్రాణాలతో చేరుకోగలిగాను.. మీ సీఎంకు థాంక్స్: ప్రధాని మోదీ
Also Read: Peacock Viral Video: హార్ట్ టచింగ్ వీడియో- చనిపోయిన నెమలిని ఆవేదనతో వెంబడిస్తూ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Omicron Death in India: దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. కేంద్రం అధికారిక ప్రకటన