Covid cases in India:దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6358 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,99,691కి చేరింది. మరో 293 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 4,80,290కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75,456 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కి చేరింది. మహారాష్ట్రలో 167, కేరళలో 67, తెలంగాణలో 55,గుజరాత్ 49, రాజస్తాన్ 46, తమిళనాడు 34, కర్నాటక 31, మధ్యప్రదేశ్ 9 కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల రికవరీ రేటు 98.40 శాతానికి చేరింది. గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకూ ఇదే అత్యధిక రికవరీ రేటు కావడం గమనార్హం. ప్రస్తుతం కోవిడ్ పాజిటివిటీ రేటు 0.61శాతంగా ఉంది. గత 85 రోజులతో పోలిస్తే 2 శాతం మేర కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గింది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.64శాతంగా ఉంది. గత 44 రోజుల కన్నా 1శాతం మేర వీక్లీ పాజిటివిటీ రేటు తగ్గింది.
ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 142.47 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. ప్రస్తుతం మరో 16.80 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. సోమవారం (డిసెంబర్ 27) కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ఆ రాష్ట్రాల్లో కోవిడ్ పట్ల (Covid 19 cases) తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్‌పై ఆయా రాష్ట్రాల అధికారులతో చర్చించారు. ఆ రాష్ట్రాల్లో కోవిడ్ టెస్టులతో పాటు వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని సూచించారు.
Also Read: Eluru Rape Case: యువతిపై సీఐ అత్యాచారం..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook