India Corona Update: దేశంలో కరోనా కేసులు రోజురోజూకు పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 13,154 కేసులు (Covid cases in India) వెలుగుచూశాయి. దీంతో మెుత్తం కేసుల సంఖ్య 3,48,22,040కి చేరింది. వైరస్ తో 268 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 7,486 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 82,402 యాక్టివ్ కేసులు (Active Cases in India) ఉన్నాయి. బుధవారం 63,91,282 మందికి వ్యాక్సిన్లు (Covid Vaccination) అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,43,83,22,742కు చేరింది.
మరోవైపు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల (Omicron cases in India) సంఖ్య 961కి చేరింది. ఢిల్లీలో 263, మహారాష్ట్రలో 252, గుజరాత్ లో 97, రాజస్తాన్ 69, కేరళలో 65, తెలంగాణలో 62, తమిళనాడు 45, కర్నాటక 34, ఏపీ 16, హర్యానా 12, పశ్చిమ బెంగాల్ 11, మధ్యప్రదేశ్ 9, ఒడిశాలో 9 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒమిక్రాన్ నుంచి 320 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఈ ఒమిక్రాన్ వేరియంట్ దేశంలోని 22 రాష్ట్రాలకు వ్యాపించింది.
India reports 13,154 new COVID19 cases in the last 24 hours; Omicron case tally rises to 961 with 263 cases in Delhi and 252 in Maharashtra pic.twitter.com/LEea2AP2UO
— ANI (@ANI) December 30, 2021
Also read: Coronavirus: దేశంలో కొత్తగా 9,195 కరోనా కేసులు... 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు (World Wide Covid Cases) ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అమెరికాలో నిన్న ఒక్కరోజే 4,65,449 మంది కొవిడ్ బారిన పడ్డారు. 1,674 మంది మరణించారు. ఐరోపాలో కూడా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఫ్రాన్స్, గ్రీస్, బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో రికార్డు స్థాయి కరోనా కేసులు నమోదవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook