Elephant Saves Itself: కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలకుడి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నది ఉధృతికి ఓ ఏనుగు 2కి.మీ దూరం కొట్టుకుపోయింది. అయితే నది ఉధృతికి ఎదురు నిలబడి దాదాపు 3 గంటల పాటు ఆ ఏనుగు గట్టి పోరాటమే చేసింది. ఎట్టకేలకు ఆ నది ప్రవాహం నుంచి బయటపడి ఒడ్డుకు చేరుకోగలిగింది.
Sabarimala: కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శబరిమలకు అయ్యప్ప భక్తుల యాత్రను రద్దు చేసింది స్థానిక యంత్రాంగం. పరిస్థితులు కుదుట పడగానే యాత్రికులను అనుమతిస్తామని ప్రకటించింది.
heavy rainfall in Kerala: కేరళలో వర్షబీభత్సం కొనసాగుతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షాలు దేవభూమిని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వరదల ధాటికి నది ఒడ్డున ఉన్న ఓ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఎప్పుడెప్పుడు చినుకు పడుతుందా, ఎప్పుడెప్పుడా సాగు మొదలెడదామా అని వర్షం కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్న రైతులకు ఇంకా వేచిచూడక తప్పదు అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని, దీని ప్రభావం కారణంగా రానున్న మూడు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్, విదర్భ ప్రాంతాల్లో తూర్పు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ప్రస్తుతం కోస్తాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల మీదుగా కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టంచేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.