తెలంగాణకు వర్షసూచన: హైదరాబాద్ వాతావరణ కేంద్రం

ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో తెలంగాణకు వర్షసూచన

Last Updated : Oct 6, 2018, 12:20 PM IST
తెలంగాణకు వర్షసూచన: హైదరాబాద్ వాతావరణ కేంద్రం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాల తిరోగమనం పూర్తవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలతోపాటు ఉత్తర అరేబియా సముద్రం నుంచి ఇప్పటికే రుతుపవనాల ఉపసంహరణ పూర్తి కాగా ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల తిరోగమనానికి పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న మరో రెండు రోజుల్లో రుతుపవనాల వీటి ఉపసంహరణ పూర్తయిన అనంతరం ఈ నెల 10 నుంచి ఈశాన్య రుతుపవనాల ఆగమనం మొదలవుతుందని, ఫలితంగా గాలిలో తేమ పెరిగి పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. 

తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక రాష్ర్టాల్లో ఈ నెల 8వ తేదీ నుంచే ఈశాన్య రుతుపవనాల ప్రభావం కనిపించనుందని చెప్పిన ఆయన.. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టంచేశారు.

Trending News