heavy rainfall in Kerala: వరుణుడి ప్రకోపానికి కేరళ చిగురుటాకులా వణికిపోతుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు దేవభూమి(Kerala)ని ఉక్కరిబిక్కిరి చేస్తున్నాయి. అక్కడ కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains in Kerala) ధాటికి నగరాలన్నీ నదులును తలపిస్తున్నాయి. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. పంట పొలాలు జలమయమయ్యాయి.
ముఖ్యంగా కొట్టాయం, ఇడుక్కి జిల్లాలలో వరదల ధాటికి కొండ చరియలు(Landslides) విరిగిపడ్డాయి. ఫలితంగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వరదల కారణంగా కేరళలో ఇప్పటి వరకు 26 మంది మరణించినట్లు తెలిసింది. వీరిలో ఒక్క కొట్టాయం జిల్లా వాసులే 13 మంది. ఇడుక్కి జిల్లా(Idukki)లో తొమ్మిది మంది, అలప్పుజలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వరద బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలో వరదల ధాటికి నేలమట్టమయిన ఓ రెండంతస్తుల బిల్డింగ్(House collapses) వీడియో అక్కడి పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో అద్దం పడుతోంది.
#WATCH | Kerala: A house got washed away by strong water currents of a river in Kottayam's Mundakayam yesterday following heavy rainfall. pic.twitter.com/YYBFd9HQSp
— ANI (@ANI) October 18, 2021
Also Read: Kerala Floods Havoc: విధ్వంసం సృష్టించిన కేరళ వరద దృశ్యాలు
భారీ వర్షాలకు కొట్టాయం(Kottayam distric)లోని ముందకాయం ప్రాంతంలోని మణిమాల నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో నది ఉగ్రరూపం దాల్చి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నది ఒడ్డున ఓ ఇల్లు(House Collapse) ఉంది. అయితే వరద ప్రవాహం పెరగడంతో చూస్తుండగానే ఈ ఇల్లు నదిలో కుప్పకూలి కొట్టుకుపోయింది. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇంటి ముందు నిల్చున్న జనాలు కొందరు ఈ సంఘటన వీడియో తీశారు. వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆదివారం కేరళ సీఎం పినరయి విజయన్(CM Pinarayi Vijayan)కు ఫోన్ చేసి.. రాష్ట్రంలో వర్ష ప్రభావం గురించి చర్చించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి