భూతల స్వర్గం అని పిలుచుకునే కాశ్మీర్ తర్వాత మళ్లీ అంత అందమైన ప్రదేశంగా పేరున్న రాష్ట్రం కేరళ. చుట్టూ కొబ్బరి, అరటి తోటలు.. అక్కడక్కడా అందమైన సరస్సులు, పవిత్ర పుణ్యక్షేత్రాలతో నిండివున్న కేరళ పర్యాటక ప్రాంతంగా బాగా అభివృద్ధి చెందింది. అయితే, అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు మాత్రం ఎటు చూసినా వరదలు మిగిల్చిన విషాదాలే కనిపిస్తున్నాయి. వరదల్లో కొట్టుకుపోయిన గ్రామాలు, నీట మునిగిన ఇళ్లతో కేరళ కకావికలమైపోయింది. కేరళలో ఏం జరుగుతుందా అని యావత్ ప్రపంచం దృష్టిసారించేంత భారీ నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే కేరళ వరదలకు ముందు ఎలా ఉంది ? కేరళ తర్వాత ఎలా ఉంది అని తెలుసుకునే విధంగా నాసా ఉపగ్రహం బంధించిన ఫోటోలను నాసా అంతరిక్ష కేంద్రం తాజాగా విడుదల చేసింది.
మొదటి ఫోటో : వరదలకు ముందు ఫిబ్రవరి, 6న ఉపగ్రహం బంధించిన ఫోటో
రెండో ఫోటో : వరదల తర్వాత ఆగస్టు 22న ఉపగ్రహం బంధించిన ఫోటో