PF Rules and Changes: ఈ ఏడాది నుంచి పీఎఫ్‌కు సంబంధించి ఈపీఎఫ్ సంస్థ 5 కీలకమైన మార్పులు చేస్తోంది. పీఎఫ్ ఖాతాదారులకు చాలా లబ్ది చేకూర్చే లాభాలివి. ఈ ఏడాది పీఎఫ్ ఎక్కౌంట్లో చోటుచేసుకునే 5 లాభాలేంటో చూద్దాం.
ఈపీఎఫ్ సంస్థలో ఈ ఏడాది కన్పించనున్న కీలకమైన మార్పుల్లో ఒకటి ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బుల్ని ఎప్పుడైనా విత్ డ్రా చేసుకునే అవకాశం కలగడం. ఇదే పీఎఫ్‌కు సంబంధించి అతి పెద్ద మార్పు కానుంది. దీనికోసం ఈపీఎఫ్ సంస్థ ప్రతి ఖాతాదారుడికి ఒక ఏటీఎం కార్డు జారీ చేస్తుంది. ఈ కార్డు సహాయంతో తమ పీఎఫ్ ఎక్కౌంట్లో ఉన్న డబ్బుల్ని అవసరం మేరకు డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం పీఎఫ్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే 7-10 రోజులు పడుతోంది. ఇక రెండవ మార్పు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పించడం. పీఎఫ్ ఖాతాదారులు తమ డబ్బుల్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇది ఈపీఎఫ్ త్వరలో లాంచ్ చేసే యాప్ ద్వారా సాధ్యమౌతుంది.
ఈపీఎఫ్ఓలో పీఎఫ్ ఫండ్ అనేది రిటైర్మెంట్ తరువాత చేతికి అందుతుంది. దీన్నించే పెన్షన్ కూడా అందుతుంది. పీఎఫ్ ఖాతాదారులు తమ డబ్బుల్ని సులభంగా విత్ డ్రా చేసుకునేలా మార్పులు రానున్నాయి. అంటే బ్యాంక్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియ లేకుండా ఈజీగా డబ్బులు పొందవచ్చు. ఈపీఎఫ్ఓ ఐటీ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తోంది. తద్వారా పీఎఫ్ ఖాతాదారుడు నేరుగా డబ్బులు డిపాజిట్ చేయగలడు. సులభంగా క్లెయిమ్స్ సెటిల్ అవుతాయి. ఈ ఏడాది పీఎఫ్ కంట్రిబ్యూషన్ వాటా పరిమితి మారనుంది. ప్రస్తుతం 12 శాతం ఉంది. ఇకపై దీనిని మార్చుకోవచ్చు.
Also read: Turmeric Milk: ఈ సమస్య ఉన్నవాళ్లు పసుపు పాలు తాగితే ప్రమాదకరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి