కేరళ వరదలు : కేరళ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం

కేరళ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం

Last Updated : Sep 4, 2018, 06:28 PM IST
కేరళ వరదలు : కేరళ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం

భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ సర్వం కోల్పోయిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. వరదల్లో ఆర్థికంగా ఎంతో నష్టపోయి కోలుకోలేని పరిస్థితుల్లో వున్న రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పడేయాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని భావించిన కేరళ రాష్ట్ర సర్కార్.. ఇకపై ఏడాదిపాటు రాష్ట్రంలో ప్రభుత్వం తరపున జరిపాల్సి వున్న అన్ని అధికారిక ఉత్సవాలు, వేడుకలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం జరిపే అధికారిక ఉత్సవాలు, వేడుకలను ఏడాదిపాటు రద్దు చేస్తున్నట్టు తాజాగా కేరళ సర్కార్ స్పష్టంచేసింది. కేరళ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ ఏడాది ఆ రాష్ట్రంలో జరగాల్సి ఉన్న అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌తోపాటు పలు యూత్ ఫెస్టివల్స్ సైతం రద్దయ్యాయి.

 

Trending News