Telangana Omicron Cases: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో 12 మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా 79 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
Travis Head Tests Positive For Covid : ఆస్ట్రేలియా జట్టు ఆటగాడు ట్రావియస్ హెడ్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. సిడ్నీ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌కు ట్రావియస్ హెడ్ దూరమయ్యాడు. తాజాగా ట్రావియస్ హెడ్‌కు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది.
ఇటీవలి కాలంలో బాలీవుడ్లో కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు వరుసగా మహమ్మారి బారిన పడుతున్నారు. రెండు వారాల క్రితం కరీనా కపూర్ ఖాన్ వైరస్ బారినపడి కోలుకోగా.. తాజాగా అర్జున్ కపూర్ (Arjun Kapoor)కు వైరస్ సోకింది. అర్జున్ కపూర్‌తో పాటు అతడి కుటుంబంలోని మరో ముగ్గురికి ఈరోజు పాజిటివ్ అని తేలింది. అర్జున్ సహా రియా కపూర్, కరణ్ బూలానీ, అన్షులా కపూర్‌కు సైతం కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉండగా.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఇల్లుకు సీల్ వేసింది.
Mumbai may cross 2k daily Covid cases : మహారాష్ట్ర సీఎం కుమారుడు, పర్యాటక, పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే కోవిడ్ కేసులపై ఒక ప్రకటన చేశారు. ముంబైలో ఈ రోజు 2000 కేసులు దాటే అవకాశం ఉందని చెప్పారు.
Omicron Symptoms: Skip Attending 2022 New Year celebrations : మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరూ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ ఈ లక్షణాలు ఉంటే వేడుకల్లో అస్సలు పాల్గొనకండి.
3 fresh Omicron cases in Telangana : తెలంగాణలో తాజాగా మరో 3 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరింది. తెలంగాణలో కోవిడ్ ఆంక్షలు మొదలయ్యాయి.
Covid Third Wave - rivers become dumping ground for dead : ప్రస్తుతం కోవిడ్ థర్డ్ వేవ్ మొదలైంది. కోవిడ్ థర్డ్ వేవ్‌తో డెత్స్ పెరిగితే సెకెండ్ వేవ్ నాటి పరిస్థితులు తలెత్తుతాయోమోనని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Delhi Sarojini Nagar Market to follow odd-even operations : ఢిల్లీలో అకస్మాత్తుగా కోవిడ్ కేసులు పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణమని వైద్యాధికారులు చెప్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్లోని షాపులు బేసి - సరి విధానాన్ని అనుసరించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది.
Omicron Cloth Masks : ఒమిక్రాన్ నుంచి రక్షణ కోసం రంగురంగుల
క్లాత్ ఫేస్ మాస్క్‌లు, డిజైన్స్ క్లాత్ మాస్క్‌లు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ క్లాత్ ఫేస్ మాస్క్‌లు నిజంగా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయా.. ఇవి ప్రమాదకరమైనావా? అనే విషయం గురించి తెలుసుకుందాం.
12 omicron positive new cases in telangana : తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 20కి చేరింది. కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ ఒక ప్రకటన చేసింది.
Karnataka: కర్ణాటకలో మరో ఆరు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని రెండు క్లస్టర్లలోని రెండు విద్యాసంస్థల్లో ఐదు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.
Lockdown in some states soon : దేశం మొత్తం లేదా ఒమిక్రాన్ విస్తరిస్తోన్న రాష్ట్రాల్లో లాక్డౌన్ విధిస్తారంటూ ప్రచారం సాగుతోంది. పబ్లిక్ ప్లేస్‌లలో కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణలో ఇప్పటికే ఒమిక్రాన్ ఎఫెక్ట్ వల్ల హైదరాబాద్‌లో తొలి కంటైన్మెంట్ జోన్ కూడా ఏర్పాటైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.