Revanth Reddy Failures: ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. ప్రభుత్వ వైఫల్యాలు వంటి వాటితో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దేశం ముందు ఉంచారు. రేవంత్ రెడ్డి తప్పిదాలు, వైఫల్యాలను దేశ రాజధాని ఢిల్లీలో కేటీఆర్ జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల సంఘటన తీవ్ర దుమారం రేపుతుండగా వీటిపై జాతీయ స్థాయిలో కేటీఆర్ పోరాటానికి దిగారు.
Also Read: Telangana Survey: ఇంటింటి సర్వేపై అదే నిర్లక్ష్యం.. 12 రోజులలో 58 శాతమే పూర్తి
ఇప్పటికే ఢిల్లీ వేదికగా గతంలో ప్రెస్ మీట్ నిర్వహించగా.. తాజాగా మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి లగచర్ల సంఘటనతోపాటు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఢిల్లీ వేదికగా గతంలో ప్రెస్ మీట్ నిర్వహించగా.. తాజాగా మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి లగచర్ల సంఘటనతోపాటు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా లగచర్ల గ్రామంలోని బాధితుల కష్టాలు.. రేవంత్ ప్రభుత్వ దుర్మార్గపు చర్యను బాధితులతో మాట్లాడించి వివరించారు.
Also Read: KT Rama Rao: లగచర్ల గ్రామాన్ని రేవంత్ రెడ్డి సమాధి చేస్తుండు: కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ. 'దేశంలో మణిపుర్, ఝాన్సీ శిశువుల మృతి సంఘటనలపై వార్తలు వేస్తున్న మీడయా లగచర్లలో జరుగుతున్న దాడి సంఘటనలపై ఎందుకు స్పందించడం లేదు' అని వివరించారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కొడంగల్‌లో దారుణ సంఘటనలు చోటుచేసుకుంటుంటే ఎందుకు స్పందిచడం లేదు అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter