Omicron variant: Skip Attending 2022 New Year celebrations If You Are Experiencing These Symptoms: యూకేలో ఒమిక్రాన్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. చాలా వేగంగా ఇది వ్యాప్తి చెందుతోంది. మనదేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి. మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరూ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇప్పటికే మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఒమిక్రాన్ వ్యాప్తిని కాస్త తగ్గించేందుకు రాత్రిపూట కర్ఫ్యూలు కూడా విధించారు.
Omicron : ఆ లక్షణాలుంటే న్యూ ఇయర్ పార్టీలకు వెళ్లకండి.. ఒమిక్రాన్ ఉంది జాగ్రత్త..