Telangana Omicron Cases: తెలంగాణలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు

Telangana Omicron Cases: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో 12 మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా 79 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 09:12 PM IST
    • తెలంగాణలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు
    • విదేశాల నుంచి వచ్చిన వారికి సోకినట్లు ప్రకటన
    • మొత్తంగా 79కి చేరిన ఒమిక్రాన్ కేసులు సంఖ్య
Telangana Omicron Cases: తెలంగాణలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు

Telangana Omicron Cases: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఒమిక్రాన్ భయాందోళనల వేళ దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరినట్లు పేర్కొన్నారు. 

హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపుగా 123 మంది ప్రయాణికులు ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చారు. వారికి కొవిడ్ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో 10 మంది ప్రయాణికులకు కరోనా సోకినట్లు తేలింది. వెంటనే వారి నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా వారితో పాటు మరో ఇద్దరూ ఒమిక్రాన్ బారిన పడినట్లు వెల్లడైంది.  

తెలంగాణలో కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 28,886 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,82,215కి చేరింది. 

మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనా ధాటికి ఇద్దరు కన్నుమూసినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల 4,029 మంది మరణించినట్లు తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 232 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,733 మంది యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.  

Also Read: Drunk and drive cases: న్యూ ఇయర్​ సెలెబ్రేషన్స్ ఎఫెక్ట్​- వేలల్లో డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులు!

Also Read: Telangana liquor sales: మద్యం అమ్మకాల్లో తెలంగాణ కొత్త రికార్డు- నెలలో రూ.3,350 కోట్ల విక్రయాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News