Omicron cases in Karnataka: దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా కర్ణాటకలో మరో 12 ఒమిక్రాన్ కేసులు(Omicron cases Karnataka) వెలుగుచూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య 31కి చేరింది. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్(Dr Sudhakar K) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.ఇప్పటివరకు దేశంలో మెుత్తం 298 ఒమిక్రాన్ కేసుల ఉన్నాయి.
తమిళనాడు(Tamilnadu)లో ఒక్కరోజే 33 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 34కు చేరింది. చెన్నైలో 26, సేలంలో ఒకటి, మధురైలో నాలుగు, తిరువన్నమలైలో రెండు కొత్త కేసులు వెలుగుచూశాయి. బంగాల్లో ఇద్దరు వ్యక్తులకు తాజాగా ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3కు చేరింది. నైజీరియా నుంచి ఒడిశా వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిందని భువనేశ్వర్ లైఫ్ సైన్సెస్ వెల్లడించింది. అజ్మీర్‌లో ఒమిక్రాన్ కేసు వెలుగులోకి వచ్చింది.
Also Read: Omicron Cases in Tamilnadu: తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదు
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్(Omicron) అలజడి రేపుతోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బ్రిటన్ లో 24 గంటల వ్యవధిలోనే లక్షకుపైగా కేసులు నమోదవ్వగా...అందులో 13వేలకుపైనే ఒమిక్రాన్ కేసులు ఉండటం విశేషం. యూకే(UK)లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69వేలు దాటినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి