China Coronavirus Cases: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ముప్పుగా వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ నగరాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
కరోనావైరస్ విజృంభిస్తుండటంతో భూటాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యకాలంలో కోవిడ్ కేసుల (Covid-19) సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో బుధవారం నుంచి ఏడురోజుల పాటు మళ్లీ లాక్డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణతో ( Nandamuri Balakrishna ), మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్, నటి కియారా అద్వానీ నటించిన హారర్-కామెడీ మూవీ 'లక్ష్మీ బాంబ్' (Laxmmi Bomb) ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
'కరోనా వైరస్' దేశ ప్రజలను అన్ని రకాలుగా విచ్ఛిన్నం చేసిందని కాంగ్రెస్ ఎంపీ, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు భారతీయులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
'కరోనా వైరస్' దెబ్బకు అమెరికా విలవిలలాడుతోంది. అగ్రరాజ్యం అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతోంది. రోజు రోజుకు నిరుద్యోగిత శాతం విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఆమెరికా అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. సేవ్ జాబ్స్ పేరుతో ఆందోళన తీవ్రతరమవుతోంది.
బిగ్ బాస్, రోడిస్ లాంటి రియాలిటీ షోలు గెలుచుకుని టీవీ రియాలిటీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అశుతోష్ కౌశిక్ పెళ్లి చేసుకున్నాడు. అశుతోశ్ కౌశిక్ పెళ్లి ఎప్పుడో ముందే సెటిల్ అయింది.
తెలంగాణలో శుక్రవారం 13 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983కు చేరింది ఆయన అన్నారు.
తెలంగాణలో గురువారం కొత్తగా మరో 27 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నేడు గుర్తించిన పాజిటివ్ కేసులలో 13 కేసులు జిహెచ్ఎంసి పరిధిలోనే ఉన్నాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 970 కి చేరింది.
అసలే.. 'కరోనా వైరస్'.. ఆపై లాక్ డౌన్.. ఈ క్రమంలో వలస కూలీలు ఆగమాగమైపోతున్నారు. బతుకుదెరువు కోసం జన్మనిచ్చిన ఊరును వదిలి.. పొట్ట చేతపట్టుకుని రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటి వచ్చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా.. బతుకుదెరువు లేక.. బతికే మార్గం తెలియక.. మళ్లీ సొంతూళ్లకు తిరిగి వెళ్తున్నారు.
కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్‌ను తప్పనిసరిగా పాటించాల్సిందిగా కోరుతూ అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టన్సింగ్ వంటి నిబంధనలను పాటించి కరోనాను తరిమికొట్టాల్సిందిగా ప్రముఖులు సందేశాలతో కూడిన వీడియోలు విడుదల చేసి జనంలో అవగాహన కల్పిస్తున్నారు.
హైదరాబాద్ ఘట్కేసర్ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున అసాధారణ సంఘటన జరిగింది. ఓ నిండు గర్భిణీకి ఆంబులెన్స్‌లోనే డెలివరీ జరిగింది. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది.
కరోనావైరస్ కారణంగా దేశంలో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడటంతో తమ ఉద్యోగాలకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయోననే టెన్షన్ ప్రస్తుతం భారతీయులను వేధిస్తోందట. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిందేంటంటే..
ఆల్కాహాల్‌కి బానిసైన ఓ యువకుడు లాక్ డౌన్ కారణంగా ఆల్కహాల్ లభించడం లేదని శానిటైజర్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం చోటుచేసుకుంది. కేరళలోని కుయంకుళంలో మద్యం దొరకడం లేదనే ఆందోళనతో షేవింగ్ క్రీమ్ లోషన్ తాగి ప్రాణాలు కోల్పోయాడు.
కరోనా వైరస్ వ్యాప్తి ప్రబలుతున్న కారణంగా రాష్ట్ర, దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో తన కుమారుడు వేరే రాష్ట్రంలో చిక్కుకున్నాడని తెలియగానే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయిందని స్థానికులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న వేళ.. అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
కరోనా వైరస్ (COVID-19) పేరు వింటేనే ఇప్పుడు యావత్ దేశం నిలువునా వణికిపోతోంది. కరోనావైరస్ వేగంగా విస్తరిస్తున్న తీరు.. వ్యాధితో వస్తున్న లక్షణాలు (Coronavirus symptoms), సంభవిస్తున్న మరణాల సంఖ్యను (Fatalities) చూసే జనం హడలెత్తిపోతున్నారు.
లాక్ డౌన్ నేపథ్యంలో మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసుకోవడానికి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోగా... ఆ కోపంతో వారు పోలీసులపైకి రాళ్లు రువ్విన ఘటన కర్ణాటక హుబ్లిలోని మంతూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.
కరోనావైరస్ వ్యాపించకుండా కేంద్రం తీసుకుంటున్న పఠిష్టమైన చర్యల్లో భాగంగా ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ పాటిస్తుండగా.. లాక్ డౌన్ కఠినంగా అమలయ్యేందుకు పోలీసులు వారి వంతు పాత్ర పోషిస్తూ జనాన్ని రోడ్లపైకి రాకుండా తీవ్ర కృషి చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.