Coronavirus Cases: మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ నగరాల్లో లాక్‌డౌన్

China Coronavirus Cases: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ముప్పుగా వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ నగరాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 12:11 PM IST
  • కరోనా మహమ్మారి మళ్లీ పంజా
  • భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు
  • పలు నగరాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు
Coronavirus Cases: మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ నగరాల్లో లాక్‌డౌన్

China Lockdown News: ప్రపంచాన్ని గడగడలాడించిన మ‌రోసారి క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. చాలా దేశాల్లో పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు కనిపిస్తోంది. చైనాలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఆ దేశం మరోసారి కరోనా హాట్‌స్పాట్‌గా మారుతోంది. చైనాలోని చాలా నగరాల్లో పరిస్థితి లాక్‌డౌన్‌లా మారింది. మన దేశంలో శనివారం 39,791 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఒక కరోనా రోగి మరణించాడు.

చైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో పలు నగరాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనేక నగరాల్లో పరిస్థితి ఇప్పుడు లాక్‌డౌన్‌లాగా మారింది. చైనా ఇటీవల స్థానిక లాక్‌డౌన్లు, సామూహిక పరీక్షలు, ప్రయాణ పరిమితులు, అనేక ఇతర ఆంక్షలను అమలు చేసింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

చైనాతో పాటు బ్రెజిల్‌లో కూడా కరోనా వేగంగా విస్తరిస్తోంది. ది బ్రెజిలియన్ నివేదిక ప్రకారం.. బ్రెజిల్‌లోని 27 రాష్ట్రాల్లో 15 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఫెడరల్ హెల్త్ రెగ్యులేటర్ అన్విసా విమానాశ్రయాలు, విమానాలలో మాస్క్‌లను తప్పనిసరి చేసింది. దీంతో ప్రజలు వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గత ఆరు వారాల్లో అలాగోస్, బహియా, సియెర్రా, ఫెడరల్ డిస్ట్రిక్ట్, గోయాస్, మాటో గ్రోసో డో సుల్, మినాస్ గెరైస్, పారా, పరైబా, పియాయ్, రియో ​​గ్రాండే డో నోర్టే, రియో ​​డి జనీరో తదితర ప్రాంతాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరిగాయి.  

జపాన్‌లో కూడా కరోనా భారీగా వ్యాప్తి చెందుతోంది. జపాన్ టుడే నివేదిక ప్రకారం.. జపాన్‌లో శనివారం 1,25,327 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రాజధాని టోక్యోలోనే 13,569 మందికి కరోనా సోకింది. అదేవిధంగా జపాన్ దేశవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల సంఖ్య 164కి చేరుకుంది. దేశంలో కరోనా పరిస్థితిని సమీక్షిస్తున్నామని ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా ఇటీవలె తెలిపారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల మరోసారి ప్రజలకు భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే లాక్‌డౌన్ల ఎఫెక్ట్‌తో ప్రజా జీవితం అస్తవ్యస్తమైంది. ఇప్పుడిప్పుడే అందరూ కోలుకుంటున్న సమయంలో మళ్లీ కోవిడ్ కేసుల పెరగడం కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: Shraddha Murder Case: జ్యూడీషియల్ కస్టడీకి అఫ్తాబ్.. తీహార్ జైలులో ఎలా ఉన్నాడంటే..!  

Also Read: Bigg Boss 6 Telugu Winner : బిగ్ బాస్ విన్నర్ రేవంత్.. హింట్ ఇచ్చేసిన ప్రభాకర్, శివ బాలాజీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News