న్యూ ఢిల్లీ: కరోనావైరస్ వ్యాపించకుండా కేంద్రం తీసుకుంటున్న పఠిష్టమైన చర్యల్లో భాగంగా ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ పాటిస్తుండగా.. లాక్ డౌన్ కఠినంగా అమలయ్యేందుకు పోలీసులు వారి వంతు పాత్ర పోషిస్తూ జనాన్ని రోడ్లపైకి రాకుండా తీవ్ర కృషి చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చిన జనానికి లాక్ డౌన్ వెనుకున్న అవసరాన్ని, అర్థాన్ని తెలియజేస్తూ వారిని తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు. ఫలితంగా లాక్ డౌన్ ఒక పథకం ప్రకారం పక్కాగా అమలవుతోంది. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ ని అడ్డుకునేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ( ISIS terrorists) కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులకు అందిన నిఘా సమాచారం ప్రకారం ఢిల్లీలో లాక్ డౌన్ అమలయ్యేలా చూస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై లోన్ వోల్ఫ్ తరహా దాడులకు పాల్పడేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కుట్రపన్నినట్టు తెలుస్తోంది. లోన్ వోల్ఫ్ ఎటాక్స్ అంటే పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులను పొడవడం, తుపాకీతో కాల్పులు జరిపి పారిపోవడం లేదా పోలీసు పికెట్స్‌ని ఏదైనా వాహనంతో బలంగా ఢీకొట్టడం చేసి హానీ తలపెట్టడం లాంటి దాడులనే లోన్ వోల్ఫ్ దాడులుగా పిలుస్తుంటారు.
Read also : దిగొచ్చిన గ్యాస్ బండ ధర
ఢిల్లీ పోలీసులపై దాడి జరిగే ప్రమాదం ఉందనే అనుమానాల నేపథ్యంలో ముందే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసు అధికార యంత్రాంగం మార్చి 31 నాడే పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేసింది. విధుల్లో ఉన్న పోలీసులను మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతూనే.. అవసరమైతే మరింత మందు గుండు సామాగ్రిని సైతం సిద్ధంగా ఉంచుకోవాల్సిందిగా సూచించినట్టు తెలుస్తోంది.
Read also : Coronavirus రోగులకు రోబోలతో ఆహారం, మెడిసిన్ సరఫరా
ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసు సిబ్బంది భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. లాక్ డౌన్ పక్కాగా అమలయ్యేలా చూస్తూనే దేశ రాజధానిని డేగ కళ్లతో నిఘా నేత్రంలా పర్యవేక్షిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..