బాలకృష్ణ, బోయపాటి కొత్త సినిమా టైటిల్ ఇదేనా ?

సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణతో ( Nandamuri Balakrishna ), మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Last Updated : Sep 3, 2020, 02:05 AM IST
బాలకృష్ణ, బోయపాటి కొత్త సినిమా టైటిల్ ఇదేనా ?

సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణతో ( Nandamuri Balakrishna ), మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు నందమూరి అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. కరోనావైరస్ లాక్‌డౌన్ ( Coronavirus lockdown ) కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అభిమానులు బిబి3 ( BB3 ) అనే టైటిల్‌తో పిల్చుకుంటున్న ఈ సినిమాకు ఇంకా అధికారికంగా టైటిల్ ఖరారవ లేదు. Also read : Pawan Kalyan b'day gift: పవన్ కల్యాణ్‌కి హీరోయిన్ బర్త్ డే గిఫ్ట్

ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాల టైటిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో డేంజర్ ( Danger ) అనే టైటిల్‌ ప్రముఖంగా వినిపించింది. ఇదిలావుండగా తాజాగా ఈ సినిమాకు మరో టైటిల్ తెరపైకొచ్చింది. బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రానికి '' టార్చ్‌బేరర్ '' ( Torch bearer movie ) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు టాలీవుడ్ టాక్. Also read : Adipurush villain: విలన్ పాత్రపై ప్రభాస్ ఇచ్చిన అప్‌డేట్

ఐతే, ఈ టైటిల్‌తో మాస్ ఆడియెన్స్ ఎంతమేరకు కనెక్ట్ అవుతారనే విషయంలోనే కొంత సందిగ్ధంలో ఉన్నట్టుగా టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. Also read : Balakrishna: జై బాలయ్య.. జై జై బాలయ్య అంటోన్న నారా రోహిత్

Trending News