హైదరాబాద్: తెలంగాణలో గురువారం కొత్తగా మరో 27 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నేడు గుర్తించిన పాజిటివ్ కేసులలో 13 కేసులు జిహెచ్ఎంసి పరిధిలోనే ఉన్నాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 970 కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనావైరస్ నుంచి 262 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా మరో 25 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 693 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
Also read : లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు రూ.25,000 జరిమానా
ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 4 లక్షల పీపీఈ కిట్స్ (PPE kits), మరో నాలుగున్నర లక్షల ఎన్95 మాస్కులు (N-95 masks) అందుబాటులో ఉన్నాయి. వైద్యులందరికి అన్ని సౌకర్యాలు అందిస్తూ వారిపై దాడులు జరగకుండా రక్షణ కల్పిస్తున్నాం. మరోవైపు గచ్చిబౌలిలో కోవిడ్ హాస్పిటల్ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని అన్నారు.
Also read : నా వాహనంలో మిమ్మల్ని మధ్యప్రదేశ్ పంపిస్తా: వలస కూలీలకు మంత్రి హరీష్ రావు భరోసా
తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో తప్ప ఇతర ప్రాంతాల నుంచి కేసులు రావడం లేదు. రానున్న ఐదారు రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. కరోనా రోగులతో పాటు అనుమానితులకు 104, 108 అంబులెన్స్ వాహనాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. 108 వాహనాలు ఎక్కడైనా అందుబాటులో లేనిపక్షంలోనే ప్రైవేట్ వాహనాలను ఉపయోగించుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..