మసీదు వద్ద పోలీసులపైకి రాళ్లు రువ్వి హల్చల్

లాక్ డౌన్ నేపథ్యంలో మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసుకోవడానికి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోగా... ఆ కోపంతో వారు పోలీసులపైకి రాళ్లు రువ్విన ఘటన కర్ణాటక హుబ్లిలోని మంతూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.

Last Updated : Apr 4, 2020, 12:16 AM IST
మసీదు వద్ద పోలీసులపైకి రాళ్లు రువ్వి హల్చల్

హుబ్లి: లాక్ డౌన్ నేపథ్యంలో మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసుకోవడానికి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోగా... ఆ కోపంతో వారు పోలీసులపైకి రాళ్లు రువ్విన ఘటన కర్ణాటక హుబ్లిలోని మంతూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. తమపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు.. అనంతరం ఘటనకు బాధ్యులైన 12 మందితో పాటు మరో 50 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో బుక్ అయిన వారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

 

ఈ ఘటనపై హుబ్లి-దార్వాడ్ పోలీస్ కమిషనర్ ఆ దిలీప్ స్పందిస్తూ... ఆందోళనకారులను తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాల్సిందిగా కొంత మంది మత పెద్దలు చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదని అన్నారు. ఏదేమైనా నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ దిలీప్ తెలిపారు.

Trending News