'కరోనా వైరస్'.. కరాళ నృత్యం చేస్తున్న వేళ దేశవ్యాప్తంగా పకడ్బందీగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జనం అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి కొత్త భయం పట్టుకుంది.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. కరోనా వైరస్ లొంగిరాకపోవడంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉత్తర ప్రదేశ్ సర్కారు మరో కఠిన నిర్ణయం తీసుకుంది.
'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఐతే ప్రస్తుతం రంజాన్ నేపథ్యంలో... ముస్లింల కోసం ప్రత్యేక సడలింపులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
'కరోనా వైరస్'.. భారత దేశంలోనూ మృత్యుకేళీ ఆడుతోంది. ఇప్పటి వరకు లేని కొత్త రికార్డులను సృష్టిస్తోంది. 24 గంటల్లోనే మరణాల సంఖ్య 57కు చేరడం గుబులు రేకెత్తిస్తోంది.
'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. కాబట్టి లాక్ డౌన్ విధించారు. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న వేళ.. పరిమిత ఆంక్షలతో ఏప్రిల్ 15న లాక్ డౌన్ మార్గదర్శకాల జాబితాను విడుదల చేసింది కేంద్రం.
'కరోనా వైరస్'.. పుట్టిల్లు చైనా. వుహాన్ లో 2019 డిసెంబర్ లో ఈ వైరస్ పుట్టుకొచ్చింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు అనతి కాలంలోనే వ్యాపించింది. ఇప్పుడు 200 దేశాలకు పైగా దేశాలను ఈ మహమ్మారి భయపెడుతోంది.
'కరోనా వైరస్'.. లాక్ డౌన్ వేళ. . బాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఊసుపోవడం లేదు. కొత్త కొత్త ఛాలెంజ్‌లతో హల్చల్ చేస్తున్నారు. కుర్రకారు మనసు దోచేస్తున్నారు. యువత కూడా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఖాళీగా ఉన్నారు కాబట్టి.. బాలీవుడ్ సెలెబ్రిటీస్ పెట్టిన కొత్త కొత్త ఛాలెంజ్‌లు వైరల్ అవుతున్నాయి. కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తున్నాయి.
'కరోనా వైరస్'.. శరవేగంగా విస్తరిస్తోంది. వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా భయాందోళన నెలకొంది. మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వైరస్.. అతి కొద్దికాలంలోనే ప్రపంచ దేశాల్లో భీభత్సాన్ని సృష్టించింది. కరోనా మహమ్మారికి చికిత్స చేసేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.
'కరోనా వైరస్'.. ఆ వలస కూలీల బతుకు చిత్రాన్ని మార్చేసింది. చాలీచాలని బతుకులతో.. గుప్పెడు మెతుకుల కోసం.. గంపెడాశతో కూలీ పని చేసుకుందామని .. పుట్టిన ఊరును వదిలి.. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి జీవితం ఇప్పుడు పట్టాలు తప్పింది.
కరోనా వైరస్'... అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడిస్తోంది. అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఆ దేశంలో.. వైరస్ మహమ్మారికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు.
'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న వేళ.. ఈ మహమ్మారికి మందు కనుగొనేందుకు పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం వివిధ దేశాల్లో శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు.
'కరోనా వైరస్'.. ప్రభావం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైనా పడింది. వారికి ఇవ్వాల్సిన కరవు భత్యం ప్రకటనను కేంద్రం వాయిదా వేసింది. జులై 2021 వరకు వారికి కరవు భత్యం ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నామైనందున ఈ నిర్ణయం తీసుకుంది.
'కరోనా వైరస్' దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. క్రమక్రమంగా మృత్యు క్రీడ ఆడుతోంది. వైరస్ మహమ్మారికి భారత దేశంలో ఇప్పటికే 681 మంది బలయ్యారు. మొత్తంగా దేశంలో 21 వేల 393 మందికి కరోనా వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ విధించారు.
'కరోనా వైరస్' ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతోంది. భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. వైరస్ మహమ్మారిని వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు భారత దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. తొలుత 21 రోజులు లాక్ డౌన్ విధించినప్పటికీ .. కరోనా మహమ్మారి లొంగి రాలేదు. ఈ క్రమంలో లాక్ డౌన్ 2.0 విధించారు. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది.
'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా మృత్యుక్రీడ ఆడుతోంది. వైరస్ కరాళ నృత్యానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. రోడ్ల మీద వాహనాలు బంద్ అయ్యాయి. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వ్యాపారాలు, దుకాణాలు తెరుచుకోవడం లేదు. దీంతో అన్ని దేశాల్లో స్తబ్దత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కరోనా వైరస్ కారణంగా ప్రకృతికి మంచే జరుగుతోంది.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 'కరోనా వైరస్' సోకిందా..? ఇప్పుడు పాకిస్తాన్లో ఇదే చర్చ జరుగుతోంది. అసలే పాకిస్తాన్లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. పైగా పెద్దగా వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. ఆర్ధిక వ్యవస్థ కూడా అంతంతమాత్రంగానే ఉంది.
'కరోనా వైరస్'.. మృత్యుకేళీ ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ మహమ్మారి కారణంగా.. లక్షలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటికే లక్ష మందికిపైగా ప్రాణాలను పొట్టన పెట్టుకుందీ మహమ్మారి. కానీ కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్నప్పటికీ వైద్యులు, వైద్య సిబ్బంది, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
'కరోనా వైరస్' లాక్ డౌన్ వేళ టాలీవుడ్లో #BetheREALMAN ఛాలెంజ్ కొనసాగుతోంది. అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ వంగా దీన్ని ప్రారంభించారు. ఇంట్లో ఉన్న మగవారు.. ఇంటి పనుల్లో సహాయం చేసి.. రియల్ మ్యాన్‌గా నిరూపించుకోవాలన్నది దీని ఉద్దేశ్యం. అంతే కాదు ఆయన దీన్ని దర్శక ధీరుడు రాజమౌళిని నామినేట్ చేశారు.
'కరోనా వైరస్'.. ఎన్నెన్నో సిత్రాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మహమ్మారి వైరస్ కారణంగా.. అంతా స్తబ్దుగా మారిపోయింది. ప్రపంచమే లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయింది. జనం ఇళ్ల నుంచి బయటకు రావడమే గగనంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.