'కరోనా వైరస్'.. మృత్యుకేళీ ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ మహమ్మారి కారణంగా.. లక్షలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటికే లక్ష మందికిపైగా ప్రాణాలను పొట్టన పెట్టుకుందీ మహమ్మారి. కానీ కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్నప్పటికీ వైద్యులు, వైద్య సిబ్బంది, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైరస్ మహమ్మారి ఎప్పుడు ఎవరిని కబళిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు భారత్ లో 'కరోనా వైరస్' లక్షణాలు లేకుండా వ్యాప్తి చెందుతోంది. ఇది జర్నలిస్టుల పాలిట మరింత ఇబ్బందిగా మారింది. ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అందులోనూ అందరూ ఎలాంటి లక్షణాలు లేని కావడం మరింత కలవరపెడుతోంది.
ముంబైలో జర్నలిస్టులకు సామూహికంగా పరీక్షలు నిర్వహించడంతో ఈ విషయం బయటపడింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ప్రాణాలను ఫణంగా పెట్టి .. రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా వారందరికీ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందుకొచ్చారు. ఢిల్లీలో పని చేస్తున్న జర్నలిస్టులకు సామూహికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
Sure. We will do that https://t.co/ehcY5OMiEP
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 21, 2020
ఢిల్లీలో రోజు రోజుకు కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అంతే కాదు గత రెండు రోజులుగా నమోదవుతున్న కేసులన్నీలక్షణాలు లేనివే కావడం మరింత గుబులు పుట్టిస్తోంది..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
జర్నలిస్టులకు టెస్టులు చేస్తాం..!!