'కరోనా వైరస్' మహమ్మారిపై ధీటుగా పోరాడేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఐతే కరోనా మహమ్మారి ఇప్పటి వరకు లొంగలేదు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల కారణంగా సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీంతో అన్ని వ్యాపారాలు బంద్ అయ్యాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. దేశవ్యాప్తంగా పోలీసులు కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
'కరోనా వైరస్' మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించారు. అన్ని దేశాల కంటే ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ .. మన దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు 21 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
'కరోనా వైరస్'ను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఇంట్లో ఉండడి.. సామాజిక దూరం పాటించండి.. అని రాజకీయ, సినీ ప్రముఖులు ప్రచారం చేశారు. అత్యవసర పనులు ఉంటే తప్ప, నిత్యావసర సరుకుల కోసం తప్ప.. బయటకు రావొద్దని చెప్పారు.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీంతో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కానీ కొంత మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
ఊహించిందే జరిగింది. మరో 15 రోజులు లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.
'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగం అందుకుంది. మూడు రోజుల నుంచి పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
'కరోనా వైరస్'పై భుజం భుజం కలిపి పోరాడదామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ రోజు రెండో దఫా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. మూడు రోజుల క్రితం కేవలం 24 గంటల్లో దేశవ్యాప్తంగా వెయ్యి పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పటికీ .. పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళనకు కారణమవుతోంది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో వింత కేసు నమోదైంది. ఓ మహిళను కాలిఫోర్నియా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి కారణం తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఇంతకీ ఆ మహిళ చేసిన నేరమేంటో తెలుసా..?
'కరోనా వైరస్' దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
'కరోనా'పై మూకుమ్మడిగా పోరాడుదాం..!! సామూహిక యుద్ధం చేద్దాం. ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ... అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇచ్చిన పిలుపు. క్షేత్రస్థాయిలో మూకుమ్మడి పోరాటమే .. మహమ్మారి పారిపోవడానికి బీజం వేస్తుందని స్పష్టం చేశారు ప్రధాని.
'కరోనా వైరస్' కారణంగా ..దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 3 వేల 700 రైళ్లు రద్దు చేశారు. ఏకంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయడం ఇదే తొలిసారి. దీంతో రైల్వే కోచ్ లు మొత్తం ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.
దేశంలో కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ ను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఐనప్పటికీ కరోనా వైరస్ విస్తృతి తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయి.
'కరోనా వైరస్'.. ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని గడగడా వణికిస్తోంది. ఓ వైపు ఈ వైరస్ మృత్యుక్రీడ ఆడుతుంటే.. మరోవైపు దీనిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కరోనాకు వ్యాక్సిన కనుగొనేందుకు ప్రపంచ దేశాల్లోని పరిశోధకులు కృషి చేస్తున్నారు. అలాగే వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలపైనా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో 'కరోనా వైరస్' మరో భయంకరమైన నిజం వెలుగు చూసింది.
'కరోనా వైరస్'పై అవగాహన కల్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరికి వారు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు సినిమా అగ్రతారలు ఓ పాట విడుదల చేశారు.
'కరోనా వైరస్'.. అతి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరించింది. ఇప్పటికే అన్ని దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది.
మీ కోసమే చెబుతున్నాం.. మీ మంచి కోసమే చెబుతున్నాం.. అని ఎంత చెప్పినా.. జనం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పోలీసులకు లాఠీ ఝుళిపించాల్సిన బాధ తప్పడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే చాలా ప్రాంతాల్లో పోలీసులకు పౌరులకు మధ్య ఈ విషయం గురించి ఓ యుద్ధమే జరుగుతోంది.
'కరోనా వైరస్' కారణంగా దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. దీంతో జనాన్ని ఇళ్లలోనే ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం 32 ఏళ్లనాటి రామయణ, మహాభారత టీవీ సీరియళ్లను తిరిగి ప్రసారం చేస్తోంది.
ఆ పేదవారికి ఎంత ఎంత కష్టం. కరోనా వైరస్ దెబ్బకు వారి జీవితాలు మరింత దుర్భరంగా తయారయ్యాయి. వందలకొద్దీ కిలోమీటర్లు కాలి నడకనే వెళ్లే పరిస్థితి దాపురించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.