/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

'కరోనా వైరస్'.. కరాళ నృత్యం చేస్తున్న వేళ దేశవ్యాప్తంగా పకడ్బందీగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జనం అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి కొత్త భయం పట్టుకుంది.

జనం అంతా ఇళ్లల్లోనే ఉండడం.. ఖాళీగా ఉన్న కారణంగా జనాభా పెరిగే ప్రమాదం ఉందనే అంచనాలు ఉన్నాయి. దీనిపై జనాభా నియంత్రణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో జనాభా నియంత్రణ కోసం చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ విస్తరిస్తున్నప్పటికీ .. ఇంటి ఇంటికి వెళ్లి  జన నియంత్రణ సామాగ్రి అందించాలని నిర్ణయించింది. 

ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లా యంత్రాంగం పనులు ప్రారంభించింది. ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలకు కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు, ఇతర సామాగ్రిని ప్రజలకు అందిస్తోంది. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సహకారంతోపాటు ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్ ల సహాయం తీసుకుంటోందిి. వారు ప్రతి ఇంటికి వెళ్లి.. అవసరం ఉన్న వారికి కండోమ్స్ ప్యాకెట్లు, గర్భనిరోధక మాత్రలు ఇస్తున్నారు. అంతే కాదు.. ప్రతి ఒక్కరికీ జనాభా నియంత్రణ వల్ల కలిగే లాభాలు కూడా వివరించారు. పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకునే మార్గాలను సూచించారు. 

ఇప్పటి వరకు 30 వేల కండోమ్ ప్యాకెట్లు సరఫరా చేశామని బలియా జిల్లా వైద్యాధికారి డాక్టర్ బల్లిందర్ ప్రసాద్ తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఇంట్లోనే ఉంటున్న భార్యాభర్తలకు కుటుంబ నియంత్రణ వినోద సాధనంగా మారకూడదని ప్రభుత్వం ఆందోళన చెందుతోందని ఆయన చెప్పారు. ఐతే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ కిట్ల పంపకం అనేది కొత్త అంశమేమీ కాదని ఆయన అన్నారు. నిరంతరం  జరిగే ప్రక్రియేనన్నారు. కానీ ఇప్పుడు కాస్త వేగంగా  పంచుతున్నామని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో వినోద శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి.. భార్య, భర్తలు ఇద్దరూ జనాభా నియంత్రణను పట్టించుకునే అవకాశం ఉండదు. అందుకనే ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ వేళ జన నియంత్రణ సాధనాల పంపిణీ ఎక్కువ చేశామని డాక్టర్ బల్లిందర్ ప్రసాద్ తెలిపారు. ఐతే కండోమ్స్ పంచేటప్పుడు హెల్త్ వర్కర్లు కచ్చితంగా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Section: 
English Title: 
Condoms being home delivered in Uttar Pradesh Ballia district amid fears of population explosion during coronavirus lockdown
News Source: 
Home Title: 

ఇంటికే కండోమ్స్..!!

ఇంటికే కండోమ్స్..!!
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఇంటికే కండోమ్స్..!!
Publish Later: 
No
Publish At: 
Saturday, April 25, 2020 - 14:34