/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. కాబట్టి లాక్ డౌన్ విధించారు. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న వేళ..  పరిమిత ఆంక్షలతో ఏప్రిల్ 15న లాక్ డౌన్ మార్గదర్శకాల జాబితాను విడుదల చేసింది కేంద్రం. అప్పట్లో  నిత్యావసర వస్తువులతోపాటు మరికొన్ని కార్యకలాపాలకు మాత్రమే పరిమిత ఆంక్షలతో అనుమతులు ఇచ్చారు.  ఐతే మరోసారి లాక్ డౌన్ పరిమితులపై మరింత సడలింపు ఇచ్చింది కేంద్రం. 

ఈసారి నిత్యావసర వస్తువులు కాని వస్తువులు విక్రయించే దుకాణాలకు కూడా తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఐతే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లు , షాపింగ్ మాల్స్ కాకుండా కేవలం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలో రిజిస్టర్ అయిన  సబ్ క్లాస్ 1(x) కేటగిరీలోని షాపులకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  ప్రకటించింది. అంతే కాదు సబ్ క్లాస్ (xiii), సబ్ క్లాస్ (xiv) కేటగిరీలో ఉన్న ప్రయివేట్ సంస్థలు కూడా తెరచుకోవచ్చని వెల్లడించింది.

 

రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లలో ఉన్న దుకాణాలు, మార్కెట్ కాంప్లెక్స్ లలో ఉన్న మల్టీ బ్రాండ్, సింగిల్ బ్రాండ్ షాపులు కూడా తెరుచుకోవచ్చు. కానీ 50 శాతం  ఉద్యోగులతో మాత్రమే పని చేయించాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చూడాలి. కచ్చితంగా సామాజిక దూరం పాటించాలి.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Section: 
English Title: 
Ministry of Home Affairs eases lockdown restrictions, allows registered shops selling non-essential goods to open
News Source: 
Home Title: 

లాక్ డౌన్ పరిమితి సడలింపు..!!

లాక్ డౌన్ పరిమితి సడలింపు..!!
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
లాక్ డౌన్ పరిమితి సడలింపు..!!
Publish Later: 
No
Publish At: 
Saturday, April 25, 2020 - 09:02