చిరు, బాలయ్యకు ఎన్టీఆర్ ఛాలెంజ్

'కరోనా వైరస్' లాక్ డౌన్ వేళ టాలీవుడ్‌లో #BetheREALMAN ఛాలెంజ్ కొనసాగుతోంది. అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ వంగా దీన్ని ప్రారంభించారు. ఇంట్లో ఉన్న మగవారు.. ఇంటి పనుల్లో సహాయం  చేసి.. రియల్ మ్యాన్‌గా నిరూపించుకోవాలన్నది దీని ఉద్దేశ్యం. అంతే కాదు ఆయన దీన్ని దర్శక  ధీరుడు రాజమౌళిని నామినేట్ చేశారు.

Last Updated : Apr 21, 2020, 11:41 AM IST
చిరు, బాలయ్యకు ఎన్టీఆర్ ఛాలెంజ్

'కరోనా వైరస్' లాక్ డౌన్ వేళ టాలీవుడ్‌లో #BetheREALMAN ఛాలెంజ్ కొనసాగుతోంది. అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ వంగా దీన్ని ప్రారంభించారు. ఇంట్లో ఉన్న మగవారు.. ఇంటి పనుల్లో సహాయం  చేసి.. రియల్ మ్యాన్‌గా నిరూపించుకోవాలన్నది దీని ఉద్దేశ్యం. అంతే కాదు ఆయన దీన్ని దర్శక  ధీరుడు రాజమౌళిని నామినేట్ చేశారు.

దిగ్గజ దర్శకుడు రాజమౌళి సైతం చీపురుపట్టి ఇళ్లు శుభ్రం చేశారు.  ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ను నామినేట్ చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఛాలెంజ్ స్వీకరించారు. ఇంట్లో ఉన్న మురికిని అంతా చీపురుతో శుభ్రం చేశారు. ఇంటిని తడిగుడ్డతో శుభ్రంగా తుడిచేశారు. ఆ తర్వాత బాబాయ్ బాలయ్యకు, మెగాస్టార్ చిరంజీవికి, నట సామ్రాట్ నాగార్జునకు, విక్టరీ వెంకటేష్‌కు బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ విసిరారు జూనియర్ ఎన్టీఆర్.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News