సోనియా గాంధీ ఫైర్

'కరోనా వైరస్' దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది.  క్రమక్రమంగా మృత్యు క్రీడ ఆడుతోంది. వైరస్ మహమ్మారికి  భారత దేశంలో ఇప్పటికే 681 మంది బలయ్యారు. మొత్తంగా దేశంలో 21 వేల 393 మందికి కరోనా వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా  కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ విధించారు.

Last Updated : Apr 23, 2020, 12:16 PM IST
సోనియా గాంధీ ఫైర్

'కరోనా వైరస్' దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది.  క్రమక్రమంగా మృత్యు క్రీడ ఆడుతోంది. వైరస్ మహమ్మారికి  భారత దేశంలో ఇప్పటికే 681 మంది బలయ్యారు. మొత్తంగా దేశంలో 21 వేల 393 మందికి కరోనా వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా  కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ విధించారు.

అందరూ కలిసికట్టుగా కరోనా మహమ్మారిపై పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఎవరికి వారు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తగిన సహకారం అందిస్తామని ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఎలాంటి సహకారానికైనా సిద్ధమని.. ప్రభుత్వానికి చేయందిస్తామని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. కరోనా పై పోరాటంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా తమ తమ స్థాయిలో విధులు నిర్వర్తించాలని సోనియా గాంధీ కోరారు.

మరోవైపు మహారాష్ట్రలో సాధువులపై జరిగిన దాడిని ఆమె ఖండించారు.  దేశంలో ఇలాంటి ఘటనలు జరగడానికి బీజేపీయే  కారణమని నిందించారు. ద్వేషం, మత విద్వేషం అనే వైరస్ లను బీజేపీ వ్యాప్తి చెందిస్తోందని విమర్శించారు. కరోనా వైరస్ మహమ్మారిని సామూహికంగా ఎదుర్కోవాల్సిన ఈ సమయంలో ఇలాంటి విద్వేషాలు దేశానికి మంచివి కావన్నారు.  

మూడు వారాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందని  సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం టెస్టింగ్ కిట్లను ఎక్కువగా ఏర్పాటు చేయాలని కోరారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మరిన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. టెస్టింగ్ కిట్ల సరఫరా కొరతపై  దృష్టిసారించాలని కోరారు. అలాగే టెస్టింగ్ ప్రమాణాలు సరిగా లేవనే విమర్శలు వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో టెస్టింగ్ కిట్ల సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. 

ఉద్యోగాల కోతపైనా ప్రభుత్వం దృష్టి సారించాలని సోనియా గాంధీ  హితవు పలికారు. ఇప్పటికే తొలిసారి లాక్ డౌన్ విధించిన వేళ.. 12 కోట్ల ఉద్యోగాలు పోయాయని తెలిపారు. మలిదశ లాక్ డౌన్ సమయంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నిరుద్యోగం పెరిగితే ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. ఉద్యోగం, ఉపాధి లేని కుటుంబాలకు కనీసం నెలకు 7 వేల 500 రూపాయలు ఇవ్వాలని కోరారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News