'కరోనా వైరస్'.. అలా ఛస్తుంది..!!

కరోనా వైరస్'... అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడిస్తోంది. అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఆ దేశంలో.. వైరస్ మహమ్మారికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు.

Last Updated : Apr 24, 2020, 11:12 AM IST
'కరోనా వైరస్'.. అలా ఛస్తుంది..!!

కరోనా వైరస్'... అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడిస్తోంది. అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఆ దేశంలో.. వైరస్ మహమ్మారికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు.  వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి అక్కడి వాతావరణం కూడా ఓ కారణం కావొచ్చని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. వారు  చేసిన తాజా పరిశోధనల్లో వైరస్ నశించడానికి కారణాలు తెలిశాయి. 

అగ్రరాజ్యం అమెరికాను 'కరోనా వైరస్' కబళిచేసింది. కరోనా మహమ్మారి దెబ్బకు దాదాపు 50 వేల మంది బలయ్యారు. మొత్తంగా 8 లక్షల 60 వేల మంది వైరస్ తో పోరాడుతున్నారు. మరోవైపు కరోనా వైరస్ పై అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీకి చెందిన బయో కంటైన్ మెంట్ ల్యాబ్ పరిశోధనలు చేపట్టింది. సౌర కిరణాలు కరోనా వైరస్ ను చంపేస్తాయని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. అంతే కాదు వేడి వాతావరణం, తేమతో కూడిన వాతావరణం లేదా ఆర్ధ్రత వాతావరణం కరోనా కోరలు పీకేస్తుందని పరిశోధన వెల్లడించింది. అంటే వైరస్ శక్తి సామర్థ్యాన్నితగ్గించి .. జీవన ప్రమాణాన్ని సగానికి సగం పడిపోయేలా చేస్తుందన్నమాట.

సౌర కాంతి కిరణాలకు కరోనా వైరస్ ను నాశనం చేసే శక్తి  ఉందని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. ఒక గదిలో 70 నుంచి 75 ఫారెన్ హీట్  ఉష్ణోగ్రత, 20 శాతం తేమ వాతావరణం ఏర్పాటు చేసినప్పుడు వైరస్ జీవన ప్రమాణం సగం వరకు పడిపోయిందని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ డైరక్టరేట్ చీఫ్ బిల్ బ్రియాన్ తెలిపారు. అలాగే కరోనా వైరస్ పై నేరుగా సౌర కిరణాలు పడితే .. అందులోని అల్ట్రా వాయిలెట్ (UV) కిరణాల కారణంగా త్వరగా వైరస్ నాశనమవుతుందని చెప్పారు.  
 
కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణాలు అనేకం ఉండవచ్చని.. కానీ తాము చేసిన పరిశోధనలు రిస్క్ తగ్గించేందుకు ఉపయోగపడతాయని బిల్ బ్రియాన్ తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News