Devara Leaked Scene: లీక్ అయిన దేవర సీన్.. చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ

NTR Devara Title Card Leaked: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా.. యాక్టర్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర.. అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి.. లీకైన ఒక చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెగ వైరల్ గా మారింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 1, 2024, 07:23 PM IST
Devara Leaked Scene: లీక్ అయిన దేవర సీన్.. చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ

Devara Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్.. సినిమా తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్లో ప్రేక్షకుల మందికి రాబోతున్న.. రెండవ సినిమా ఇది. కాబట్టి ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు.. నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతోంది. 

నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కావాలి. కానీ చిత్ర బృందం సినిమాని.. త్వరగా పూర్తి చేసి ఆగస్టు 15న విడుదలకి సిద్ధం చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన.. ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా.. నుంచి ఒక లీక్ అయిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 

 

సినిమా మొదలవడమే.. సీనియర్ ఎన్టీఆర్ ఫోటోతో మొదలవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ని చూపిస్తూ చిత్ర బృందం నందమూరి తారక రామారావు ఆర్ట్స్.. అంటూ తమ బ్యానర్ ని వేయనున్నారు. తర్వాత యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పతాకంలోగో కూడా కనిపించనుంది. 

అంతేకాకుండా ఈ వీడియోలో సినిమాకి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాల.. గ్లిప్స్ కూడా ఉన్నాయి. సినిమాలో కొన్ని హై ఇంటెన్స్.. యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని ఈ టైటిల్ కార్డు హింట్ ఇచ్చేలా డిజైన్ చేశారు. ఏదేమైనా ఆ సినిమా నుంచి లీకైన ఈ చిన్న వీడియో.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ ఫోటో చూడగానే.. అభిమానులందరికీ కచ్చితంగా గూస్ బంప్స్ రావడం ఖాయం. 

మరోవైపు ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా యశ్ రాజ్ ఫిలింస్ వారి స్పై యూనివర్స్ లో.. భాగంగా విడుదల కాబోతున్న వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ వార్ 2.. సినిమాలో రెండవ హీరోగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక రా ఏజెంట్ పాత్ర లో కనిపించనున్నారు.

Also Read: NTR Bharosa Scheme: జగన్‌, చంద్రబాబు అక్కడి నుంచే.. ఆ ఊరికి అంత ప్రత్యేకం ఏమిటి?

Also Read: TDP Toll Free: మీ సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పాలా? అయితే ఈ నంబర్‌కు ఫోన్‌ చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News