'కరోనా వైరస్'.. ఆ వలస కూలీల బతుకు చిత్రాన్ని మార్చేసింది. చాలీచాలని బతుకులతో.. గుప్పెడు మెతుకుల కోసం.. గంపెడాశతో కూలీ పని చేసుకుందామని .. పుట్టిన ఊరును వదిలి.. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి జీవితం ఇప్పుడు పట్టాలు తప్పింది.
కూలీ పనులు లేక.. పొట్ట గడిచే దిక్కులేక.. కలో గంజో తాగుదామని మళ్లీ సొంతూళ్లకే బయల్దేరి వెళ్తున్నారు ఆ వలసజీవులు. కానీ ఆ వలస కార్మికునికి ఎంత కష్టం .. ఎంత కష్టం. సొంతూరికి వెళ్దామంటే .. బస్సు లేదు రైలు లేదు.. కనీసం ఎడ్లబండి కూడా దిక్కులేదు. దీంతో కాలినడకనే వందల కిలోమీటర్ల ప్రయాణం మొదలు పెట్టాడు. అడుగు అడుగు వేసుకుంటూ.. కన్నతల్లి లాంటి సొంతూరికి బయల్దేరాడు. కానీ.. దారి పొడవునా .. అన్నమో రామచంద్రా అన్నా .. ఇంత ముద్ద పెట్టేదెవ్వరు..? దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా .. మెతుకు ఇచ్చి కడుపు ఆకలి తీర్చెదెవరు..?
పడరాని కష్టం పడుతూ.. పడుతూ ..లేస్తూ కాలినడకన బాట సాగిస్తున్న ఆ బాటసారి కోసం ప్రముఖ సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ.. తన గళం విప్పారు. వలస కూలీ బతుకు కష్టాన్ని.. జీవన వైచిత్రాన్ని వివరిస్తూ పాట అందుకున్నారు..
వలస కూలీలపై శ్రీలేఖ పాట