పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి..?

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 'కరోనా వైరస్' సోకిందా..? ఇప్పుడు పాకిస్తాన్‌లో ఇదే చర్చ జరుగుతోంది. అసలే పాకిస్తాన్‌లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. పైగా పెద్దగా వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. ఆర్ధిక వ్యవస్థ కూడా అంతంతమాత్రంగానే ఉంది.

Last Updated : Apr 21, 2020, 04:16 PM IST
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి..?

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 'కరోనా వైరస్' సోకిందా..? ఇప్పుడు పాకిస్తాన్‌లో ఇదే చర్చ జరుగుతోంది. అసలే పాకిస్తాన్‌లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. పైగా పెద్దగా వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. ఆర్ధిక వ్యవస్థ కూడా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి దాయాది దేశం పాకిస్తాన్ ఇబ్బందులు ఎదుర్కుంటోంది. కాబట్టి ఇటీవలే అగ్రరాజ్యం అమెరికా ఆ దేశానికి ఆర్దిక సాయం చేసింది. 

ఇక ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ విషయానికి వస్తే.. ఉన్నంతలో కరోనా వైరస్ ఎదుర్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో లాక్ డౌన్ కొనసాగుతోంది. మరోవైపు కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కునేందుకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలపైనే ఆధారపడింది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి సాయం అందించేందుకు ఈధీ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈధీ ఫౌండేషన్‌ను ఫైసల్ ఈధీ స్థాపించారు. ఈ స్వచ్ఛంద సంస్థ కింద ఆయన సామాజిక కార్యక్రమాలు  చేస్తున్నారు. ఇటీవలే ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కలిశారు.  కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తామని తెలిపారు. 

మరోవైపు ఫైసల్ ఈధీ ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఇస్లామాబాద్‌లోని ఓ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారని పాకిస్తాన్ మీడియా తెలిపింది.  

దీంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటనే  చర్చ మొదలైంది.  ఆయనకు కరోనా వైరస్ సోకిందా..? లేదా..? అనే  చర్చ పాకిస్తాన్ వ్యాప్తంగా జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ కరోనా నిజనిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని కోరుతున్నారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News