'కరోనా వైరస్'.. ప్రభావం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైనా పడింది. వారికి ఇవ్వాల్సిన కరవు భత్యం ప్రకటనను కేంద్రం వాయిదా వేసింది. జులై 2021 వరకు వారికి కరవు భత్యం ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నామైనందున ఈ నిర్ణయం తీసుకుంది.
'కరోనా వైరస్' దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. క్రమక్రమంగా మృత్యు క్రీడ ఆడుతోంది. వైరస్ మహమ్మారికి భారత దేశంలో ఇప్పటికే 681 మంది బలయ్యారు. మొత్తంగా దేశంలో 21 వేల 393 మందికి కరోనా వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ విధించారు.
'కరోనా వైరస్' ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతోంది. భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. వైరస్ మహమ్మారిని వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు భారత దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. తొలుత 21 రోజులు లాక్ డౌన్ విధించినప్పటికీ .. కరోనా మహమ్మారి లొంగి రాలేదు. ఈ క్రమంలో లాక్ డౌన్ 2.0 విధించారు. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది.
ప్రపంచ దేశాలతో పాటు భారత్ సైతం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతోంది. కరోనా ప్రభావం ఉండదని తొలి రోజుల్లో భావించిన మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసులు 20వేలకు పైగా నమోదయ్యాయి.
'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా మృత్యుక్రీడ ఆడుతోంది. వైరస్ కరాళ నృత్యానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. రోడ్ల మీద వాహనాలు బంద్ అయ్యాయి. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వ్యాపారాలు, దుకాణాలు తెరుచుకోవడం లేదు. దీంతో అన్ని దేశాల్లో స్తబ్దత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కరోనా వైరస్ కారణంగా ప్రకృతికి మంచే జరుగుతోంది.
భారత్‌లోనూ దాదాపుగా 20వేల కరోనా పాటిజివ్ కేసులు నమోదుకాగా, 640 మంది వైరస్ సోకి చనిపోయారు. ముఖ్యంగా వలసకూలీలు, దినసరి కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు. (Baby Boy Named as LockDown)
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 'కరోనా వైరస్' సోకిందా..? ఇప్పుడు పాకిస్తాన్లో ఇదే చర్చ జరుగుతోంది. అసలే పాకిస్తాన్లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. పైగా పెద్దగా వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. ఆర్ధిక వ్యవస్థ కూడా అంతంతమాత్రంగానే ఉంది.
'కరోనా వైరస్'.. మృత్యుకేళీ ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ మహమ్మారి కారణంగా.. లక్షలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటికే లక్ష మందికిపైగా ప్రాణాలను పొట్టన పెట్టుకుందీ మహమ్మారి. కానీ కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్నప్పటికీ వైద్యులు, వైద్య సిబ్బంది, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
'కరోనా వైరస్' లాక్ డౌన్ వేళ టాలీవుడ్లో #BetheREALMAN ఛాలెంజ్ కొనసాగుతోంది. అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ వంగా దీన్ని ప్రారంభించారు. ఇంట్లో ఉన్న మగవారు.. ఇంటి పనుల్లో సహాయం చేసి.. రియల్ మ్యాన్‌గా నిరూపించుకోవాలన్నది దీని ఉద్దేశ్యం. అంతే కాదు ఆయన దీన్ని దర్శక ధీరుడు రాజమౌళిని నామినేట్ చేశారు.
'కరోనా వైరస్'.. ఎన్నెన్నో సిత్రాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మహమ్మారి వైరస్ కారణంగా.. అంతా స్తబ్దుగా మారిపోయింది. ప్రపంచమే లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయింది. జనం ఇళ్ల నుంచి బయటకు రావడమే గగనంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.