Patnam Narender Reddy Arrest: ఫార్మా రగడ.. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..

Patnam Narender Reddy Arrest: ఫార్మా రగడ పీక్స్ కు చేరింది. మొన్న కలెక్టర్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటనలో ఇప్పటికే ప్రభుత్వం పలువురు రైతులను అరెస్ట్ చేసింది. అయితే ఈ ఫార్మా రగడ వెనక బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత మాజీ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 13, 2024, 08:34 AM IST
Patnam Narender Reddy Arrest: ఫార్మా రగడ.. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..

Patnam Narender Reddy Arrest:తెలంగాణ ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో వికారాబాద్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర  కలకలం రేపింది. కలెక్టర్ తో పాటు కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ  అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్థులు ఓ పథకం ప్రకారం దాడికి పాల్పడినట్టు ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటికే ఈ ఘటనలో పోలీసులు అరెస్ట్ ల పర్వానికి తెరలేపిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పలువురు రైతులతో పాటు స్థానికంగా వీరిని రెచ్చగొట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా  బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా కాక రేపుతోంది.

వికారాబాద్‌ ఘటనలో సురేష్‌తో నరేందర్‌ రెడ్డి మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్‌ చేస్తుండగా నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు  నరేందర్ రెడ్డి ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు. అంతేకాదు ఆయన ఎవరెవరితో మాట్లాడారు. దీని వెనక కేటీఆర్, హరీష్ రావు ఉన్నారా అనుమానాలు వ్యక్తం చేస్తారు.  త్వరలో వారి అరెస్ట్ కూడా ఉండవచ్చని చెబుతున్నారు.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News