న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పాటు భారత్ సైతం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతోంది. కరోనా ప్రభావం ఉండదని తొలి రోజుల్లో భావించిన మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసులు 20వేలకు పైగా నమోదయ్యాయి. గురువారం (ఏప్రిల్ 23) ఉదయం నాటికి భారత్‌లో నమోదైన కరోనా పాటిజివ్ కేసుల సంఖ్య 21,393కు చేరుకుంది. చికిత్స అనంతరం 4,257 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటే ఎన్ని లాభాలో!
ప్రస్తుతం దేశంలో 16,454 యాక్టివ్ కేసులున్నాయి. వీరికి కోవిడ్ ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41 మందిని కరోనా బలి తీసుకుంది. దీంతో దేశంలో ఇప్పటివరకూ కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 681కి చేరుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. మహారాష్ట్రలో అధిక కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!