ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 757 పాజిటివ్ కేసులకుగాను చికిత్స అనంతరం 96 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకూ 22 మంది మరణించారు. తాజాగా ఇద్దరు మరణించగా, రెండు మరణాలు గుంటూరు జిల్లాలోనే సంభవించడం గమనార్హం. ప్రస్తుతం 639 మంది చికిత్స పొందుతున్నారు. చైనాకు ఏ పాపం తెలియదు: రామ్ గోపాల్ వర్మ
Photos: బాత్‌టబ్‌లో నటి హాట్ ఫొటోషూట్
జిల్లాలవారీగా చూస్తే కర్నూలులో 10, గుంటూరులో 9 కృష్ణాలో 3 కడపలో 6 పశ్చిమ గోదావరిలో 4, అనంతపురంలో 3 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. #APFightsCorona జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..