పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఈ రోజు హైదరాబాద్‌లోని కంటైన్మెంట్ జొన్లలో పర్యటించారు. ఖైరతాబాద్ పరిధిలోని సిఐబి క్వార్టర్స్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి కంటైన్మెంట్ జొన్లను సందర్శించిన మంత్రి కే. తారకరామారావు అక్కడి ప్రజలతో మాట్లాడారు. మరింతగా ప్రజలు వైరస్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని పరిమితులు విధించిందని, అందులో భాగంగానే కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు.
మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఆర్ధికవ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోన్న ఈ ప్రాణాంతక వైరస్ నుంచి అధిక నష్టాన్ని చవిచూస్తున్నది ఆ రాష్ట్రం.Maharashtra 3000 corona positive cases
'కరోనా వైరస్'.. మృత్యుక్రీడ ఆడుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే ఆర్ధిక వ్యవస్థ కుంటుపడుతున్న క్రమంలో ఈ నెల 20 నుంచి కొన్ని రంగాలకు పాక్షిక సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా కేంద్రం ప్రకటించింది.
నిజామాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. 'కరోనా వైరస్' ఉద్ధృతి నేపథ్యంలో పోలీసులు లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో తబ్లీగీ జమాత్ మత ప్రార్థనలకు హాజరైన వారు స్వచ్ఛందంగా వైద్యులకు సహకరించాలని చెప్పినా పట్టించుకోవడం లేదు.
'కరోనా వైరస్' ..వేగంగా విస్తరిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 2.0 కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. దీంతో ప్రజలను రోడ్లపైకి రావొద్దని..ఇళ్లల్లోనే ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
రెండో దశలో 'కరోనా వైరస్'.. వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను గడగడా వణికిస్తున్న మహమ్మారి వైరస్ కారణంగా పాజిటివ్ కేసులు 20 లక్షలు దాటిపోయాయి.
భారత్‌లో కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. వేగంగా పాజిటివ్ కేసులు నమోదు కావడం అంతటా గుబులు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు మొత్తంగా 12 వేల 380 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 10వేల 477 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను ప్రమాదకర హాట్ స్పాట్ ప్రాంతాలు (Hotspots Red Zone Districts in AP)గా ప్రకటించింది. 207 జిల్లాలను నాన్ హాట్ స్పాట్ ప్రాంతాలుగా గుర్తించారు.
గుజరాత్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఐతే సోషల్ మీడియాలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో దారుణం. 'కరోనా వైరస్'.. వ్యాప్తిని అడ్డుకునేందుకు నిరంతరం పని చేస్తున్న వైద్యులు, పోలీసులపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న వేళ .. ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.
'కరోనా వైరస్'.. మహమ్మారిని ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా మొదటగా జనతా కర్ఫ్యూ విధించారు. కానీ ఒక్క రోజుతోనే ఇది తేలే వ్యవహారం కాదని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఏకంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
'కరోనా వైరస్' వ్యాప్తిని అడ్డుకునేందుకు అవగాహన కల్పించడమే చాలా ముఖ్యం. ఈ క్రమంలో ఎవరికి తోచిన విధంగా వారు కరోనా వైరస్ వ్యాప్తి గురించి తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా AP Coronavirus Positive Cases మరో 19 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
'కరోనా వైరస్'.. మృత్యుక్రీడ ఆడుతున్న వేళ.. భారత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడగించారు. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న(బుధవారం) ప్రకటించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవాళ( గురువారం) విడుదలకానున్నాయి. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో .. దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలు కూడా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 52 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తంగా 644కు చేరింది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ మొత్తం కేసుల సంఖ్య 473గా ఉంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
'కరోనా వైరస్'.. అమెరికాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్ అతి దారుణంగా దెబ్బతిన్న దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే కావడం విశేషం. చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ఆ దేశం కంటే అమెరికానే ఎక్కువదా దెబ్బతీసింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.